Thursday, May 2, 2024

ఆస్పత్రులే హాట్‌స్పాట్లు

- Advertisement -
- Advertisement -

Hospitals become hotspots as Covid care

 ఇతర సమస్యలతో వస్తున్న రోగులకు తేలుతున్న పాజిటివ్
వైద్యుల్లోనూ పాజిటివ్ రావడంతో ఆందోళనలు
హైరిస్క్ గ్రూప్ వాళ్లకు ప్రమాదమంటున్న నిపుణులు
శానిటేషన్‌ను పకడ్బందీగా చేయాలని మంత్రి ఆదేశాలు
కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పరిమితి పరుపులతో వైద్యం

హైదరాబాద్ : రాష్ట్రంలో వైరస్ అంతటా అంటుకుంటుంది. ముఖ్యంగా ఆసుపత్రుల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. వైరస్‌పై ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వైద్యులకే వైరస్ సోకడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. అంతేగాక ఇతర సమస్యలతో ఆసుపత్రులకు వస్తు న్న వారిలోనూ కొంత మందికి వైరస్ రావడం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో చాలా మంది ఆసుపత్రులకు వెళ్లాలంటే వెనకాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీర్ఘకాలిక రోగులకు మరింత ప్రమాదం ఉందని వైద్యవర్గాలు సూచనలు చేశాయి. ఈక్రమంలోనే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఈ రోగుల కోసం ఆలన మొభైల్ కేర్ పేరిట ఇంటి వద్ద నే వైద్యం అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

ఇడా ఆడా అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోకి కోవిడ్ విస్తరిస్తుంది. రాష్ట్రంలో తొలి పాజిటివ్ నమోదైన రోజుల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు అన్నీ ప్రాంతాల్లో విస్తరించడంతో ప్రజల్లో టెన్షన్ నెలకొంది. సామాజిక వ్యాప్తి జరగలేదని స్వయంగా కేంద్ర సంస్థలైన ఐసిఎంఆర్, ఎఐఎన్ చేసిన సీరమ్ సర్వే ప్రకటించినప్పటికీ, ప్రజల్లో మాత్రం భయం అలానే ఉంది. ఎక్కడ్నుంచి వైరస్ సోకుతుందేమోనని దిగులు చెందుతున్నారు. ఇప్పటికే రోజురోజుకి కేసుల సంఖ్య పెరగుతుండంతో కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో కేవ లం సీరియస్ కండిషన్ రోగులకు మాత్రం వైద్యం అందించాలని వైద్యశాఖ నిర్ణయించుకుంది. ఈమేరకు తక్కువ, లక్షణాలు లేకుండా కోవిడ్ సోకిన వారిని ఇళ్ల వద్దనే వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మరో నెలరోజుల్లో కేసులు సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వైద్యాశాఖ ఉన్నతాధికారుల్లో ఒకరు వెల్లడించారు.

ఆసుప్రతులకు వెళ్లాలంటే వెనకాడుతున్న రోగులు

కోవిడ్ నేపధ్యంలో ఆసుపత్రులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇతర రోగాల పరిష్కానికి వచ్చి లేని వైరస్ అంటించుకోవాల్సి వస్తుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో రాష్ట్రంలోని టీచింగ్, జిల్లా ఆసుపత్రులకు ఓపి సంఖ్య చాలావరకు తగ్గింది. కేవలం అత్యవసర అవసరం నిమిత్తం వారు మాత్రమే ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 85 శాతం ఈ పరిధిలోనే నమోదు కావడంతో అధికారులతో సైతం ప్రజలకు కూడా మనోధైర్యాన్ని కొల్పోతున్నారు. దాదా పు సిటీలో ఉన్న ఆసుపత్రులన్నీ హాట్ స్పాట్లుగా మారిపోయాయి. ఇప్పటికే కరోనా కట్టడిలో కీలకమైన డాక్టర్లు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులూ వైరస్ భారిన పడ్డారు.

ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్, ప్లేట్లబురుజు, నిమ్స్ ఆసుపత్రుల్లో సుమారు 89 మందికి పైగా వైరస్ బారిన పడగా, జర్నలిస్టుల్లోనూ ఇప్పటి వరకు 15 మందికి పైగా వైరస్ సోకినట్లు సమాచారం. దీంతో పాటు పోలీసులుల్లోనూ 30 మంది వరకు వైరస్ బారిన పడగా, శానిటేషన్ సిబ్బందిలో దాదాపు 12 మంది వరకు వైరస్ బారిన పడ్డారు. దీంతో పాటు కార్పొరేట్, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ నర్సులకు కోవిడ్ సోకింది. ఆయా ఆసుపత్రుల్లో జలుబు, దగ్గు, లాంటి లక్షణాలు ఉన్న వారిని పరీక్షించడం వలనే వైరస్ కు సోకినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రభు త్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిత్యం శానిటేషన్‌ను పకడ్భందీగా చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జ్వర, ఇతర సమస్యల వారికి ఖచ్చితంగా వేర్వేరు ఓపిలు విధా నం ప్రతి ఆసుపత్రిలో ఉండాలని, లేని యెడల కఠిన చర్య లు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అదే విధంగా పిహెచ్‌సిలులోనూ ఈ విధానంని అమలు చేయాలని ఇప్పటికే మంత్రి జిల్లా వైద్యాధికారులకు సూచించారు.

ఆసుపత్రులకు వచ్చి వైరస్ సోకినవారు కొందరు

రామగుండం పోతన కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగికి గత కొంత కాలంగా బోన్ కేన్సతో బాధపడుతున్నాడు. వారం రోజుల క్రితం రెగ్యూలర్ చికి త్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వచ్చి కీమోథెరఫీ చేపించుకొని తిరిగి వెళ్లిపోయాడు. అయి తే ఇంటికి వెళ్లిన తర్వాత జ్వరం, దగ్గు రావడంతో వైద్యాధికారులు హైరిస్క్ గ్రూప్ కేటగిరీకి చెందిన వ్యక్తిగా పరిగణించి టెస్టు చేయ డా కరోనా పాజిటివ్ తేలింది. గాంధీకి తరలించాలనుకునే క్రమంలోనే ఆ వ్యక్తి మరణించా డు. అయితే ఆసుపత్రిలోనే వైరస్ అంటుకున్నట్లు జిల్లా వైద్యాధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అదే విధం గా యాదాద్రి జిల్లాకు చెందిన ఓ గర్భిణి రక్తహీనతతో బాధపడుతూ హన్మకొండ ఆసుపత్రికి వెళ్లింది.

శ్వాసలో ఇబ్బంది ఉండటంతో వైద్యులు గాంధీకి రిఫర్ చేశారు. పర్యవేక్షణలో ఉంచిన ఆమెకు డెలివరీ తర్వాత ఆమెకు పాజిటివ్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో పాటు మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి మే 30న బైక్ యాక్సిడెంట్ అయింది. అతను నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి వచ్చిన రెండు రోజులకే జ్వరం రావడంతో టెస్టు చేయగా కరోనా సోకిందని వైద్యు లు నిర్ధారించారు. ఇదే జిల్లాకు చెందిన మరోక వ్యక్తి కాలు గాయంతో దాదాపు 10 రోజులు ఉస్మానియాలో చికిత్స పొందాడు. డిశ్చార్జ్ అనంతరం అతనికి లక్షణాలు ఉండటంతో టెస్టు చేసిన వైద్యులు పాజిటివ్‌గా తేల్చారు. వీరందరికీ ఆసుపత్రుల్లోనే వైరస్ అంటుకుందని అధికారులు ధ్రువీకరించారు. దీంతో ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాలంటే భయాందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఉంది.

కార్పొరేట్ ఆసుపత్రుల్లో పరిమితి పరుపులతో వైద్యం

కోవిడ్ చికిత్స చేయొచ్చని ఇటీవల ఐసిఎంఆర్ కార్పొరేట్ ఆసుపత్రులకు అనుమతి ఇచ్చింది. కానీ ఆయా యాజమాన్యాలు పరిమితికి లోబడి పరుపులను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నాయి. కేవలం పది, ఇరవై బెడ్లతో మాత్రమే వైద్యం అందిస్తున్నామని సదరు ఆసుపత్రులు ప్రకటిస్తున్నాయి. కోవిడ్ బెడ్ల సంఖ్య పెంచితే ఇతర రోగులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, ఈమేరకు తక్కువ బెడ్లను అందుబాటులో ఉంచామని ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఎండి తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో వైరస్ వ్యాప్తి పెరగడం వలన తక్కువ మందికి పకడ్బందీగా వైద్యం అందించేందుకు మాత్రమే ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా అనుమతి పొందిన కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లైన సమకూర్చుకోవచ్చని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News