Thursday, May 1, 2025

రజనీకాంత్ పాదాభివందనాన్ని నివారించిన అమితాబ్ బచ్చన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో భాగమైన ‘శుభ్ ఆశీర్వాద్ వేడుక’లో మహామహులు పాల్గొన్నారు. ఈ వేడుక జులై 13(శనివారం) ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది.

ఈ సందర్భంలో సూపర్ స్టార్ రజనీకాంత్, హిందీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పరస్పరం ఎదురుపడ్డారు. రజనీకాంత్ తన సతీమణి లతా రజనీకాంత్ తో ఆ వేడుకకు హాజరయ్యారు. కాగా అబితాబ్ బచ్చన్ తన అల్లుడు నిఖిల్ నంద, మనుమరాలు నవ్య నవేలి తో హాజరయ్యారు.

రజనీకాంత్ నడుచుకుంటూ అమితాబ్ వైపుకు వెళ్లి, ఆయన పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుందామనుకున్నారు. అంతలో అమితాబ్ బచ్చన్ నివారించి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యం ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News