Friday, September 19, 2025

భారీగా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు భారీగా నగదు పట్టుకున్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ జిల్లాలో వివిధ ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధికారులు రూ. 46,61,000 నగదును పట్టుకున్నారు. రూ. 6,23,414 విలువైలన వివిధ రకాల వస్తువులను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా రూ. 2,03,500 నగదు పట్టుకొని సీజ్ చేశారు.

పోలీసులు రూ.44,57,500 నగదు పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. నగదు, ఇతర వస్తువుల రవాణా పై 21 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి పరిష్కారం చేసినట్లు, చివరి రోజు వరకు 14 ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. అక్రమ మద్యం 369.72 లీటర్లను పట్టుకుని 10 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. పది మందిని అరెస్టు చేశామని తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుండి ఇప్పటి వరకు రూ. 2,20,21,800 నగదు, 29 లక్షల 85 వేల 378 రూపాయల విలువ గల ఇతర వస్తువులను సీజ్ చేశామని తెలిపారు. అంతేకాకుండా 684.17 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకొని 41 ఈ మందిపై కేసులు నమోదు చేసి 43 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News