Wednesday, May 8, 2024

కీసరగుట్టలో భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

కీసర: ప్రముఖ శైవ క్షేత్రమైన కీసరగుట్టలో భక్తుల రద్దీ నెల కొంది. అమావాస్యకు తోడు సోమవారం కలిసి రావడం ప్రభుత్వం బోనాల సందర్భంగా సెలవు దినంగా ప్రకటించడంతో రద్దీ ఏర్పడింది. నగరంలో స్థిరపడిన ఉత్తర భారతీయులు శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనార్ధం భారీగా తరలిచ్చారు. వందలాది మంది మూల విరాట్ అభిషేక సేవలలో పాల్గొ న్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకొని ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు అభిషేకాలు పూజలు నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకొని స్వామి వారికి మహాన్యాస రుద్రాభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ తటాకం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News