Saturday, May 4, 2024

లైంగిక వేధింపుల ఘటనలో దోషికి క్షమాభిక్ష.. హంగేరి అధ్యక్షురాలు రాజీనామా

- Advertisement -
- Advertisement -

హంగేరి దేశ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ రాజీనామా చేశారు. ఓ చిల్డ్రెన్ హోమ్ లో చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల ఘటనలో దోషీగా తెేలిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించడంపై అధ్యక్షులు కటాలిన్ నోవాక్ పై ఆ దేశంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేఖించిన హంగేరియన్ ప్రతిపక్ష పార్టీలు.. వెంటనే నోవాక్ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

ఈ క్రమంలో శనివారం కటాలిన్ నోవాక్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల ఘటనలో తాను తప్పు చేశానని ఒప్పుకున్నారు. ఈ విషయంలో బాధితులకు సహకరించనందుకు బాధపడుతున్నానన్నారు. తాను అధ్యక్షురాలిగా కొనసాగడం సరికాదని భావిస్తున్నానని.. అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నాని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News