Thursday, May 2, 2024

వ్యాపారం, కళ వేర్వేరు

- Advertisement -
- Advertisement -

Hyderabad Film Studio

 

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున బాగ్ లింగంపల్లిలో ‘హైదరాబాద్ ఫిలిం స్టూడి యో’ పేరుతో కొత్తగా ఒక మినీ సినీ స్టూడియో ఏర్పాటయ్యింది. నగరం నిద్రపోతున్న వేళ, శరణం గచ్చామి లాంటి సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రేమ్‌రాజ్ నేతృత్వంలో ఇది రూపుదిద్దుకుంది. దీనిని ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్, బి.నర్సింగరావు (మాభూ మి, దర్శకుడు) సిఎం, ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్‌లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రేమ్‌రాజ్ తనకు చిరకాల మిత్రుడని, తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం కలిసి పని చేశామన్నారు. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. అయితే వ్యాపారం కళ రెండు వేరు వేరు దారులని, సహజంగా రచయిత, దర్శకుడైన ప్రేమ్‌రాజ్ ఇప్పుడు వ్యాపారవేత్తగా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలన్నారు. తన మిత్రుడు ఈ వ్యాపారంలో రాణిస్తే తనక న్నా ఆనందించేవారుండరని దానికోసం ఎలాంటి సహకారమైనా అందిస్తానని దేశపతి పేర్కొన్నారు.

ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్ మాట్లాడుతూ ‘ప్రేమ్‌రాజ్ వ్యక్తిగతంగా తనకు సోదరుడి లాంటివాడని, అతను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి దగ్గరగా పరిశీలిస్తున్నానని, ఏదైనా సాధించాలనుకుంటే అది చేసేదాకా నిద్రపోని మనస్తత్వం ప్రేమ్‌రాజ్‌దని ఆయన పేర్కొన్నారు. ప్రేమ్‌రాజ్ లాంటి సున్నిత మనస్కుడు వ్యాపారం చేయగలడా అని అనుకున్నానని కానీ ఈరోజు చెప్పింది చేసి చూపించాడన్నారు. నగరం మధ్యలో అందరికీ అందుబాటులో ఉన్న ఈ స్టూడియో తొందరలోనే షూటింగ్‌లతో బిజీగా మారుతుందని భావిస్తున్నానన్నారు.

దక్కన్ సంస్కృతికి ప్రతిబింబం: నర్సింగరావు
దర్శకుడు బి.నర్సింగరావు మాట్లాడుతూ హైదరాబాద్ పేరుతో ఫిలిం స్టూడియో ప్రారంభించడం దక్కన్ సంస్కృతికి ప్రతిబింబమన్నారు. ముఖ్యంగా ఈ స్టూడియో చిన్న నిర్మాతలకు, సీరియల్స్, వెబ్ సిరీస్ నిర్మించే వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నవ తెలంగాణ పత్రిక సంపాదకులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ ‘సినిమా రంగం ప్రాధాన్యత గల మాధ్యమమని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజల మీద చూపించే ప్రభావం అపారంగా ఉంటుందన్నారు. ఇది దర్శక, నిర్మాతలు గమనించి ప్రజలకు ఉపయోగపడే రీతితో చిత్రాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ స్టూడియో ఆ దిశగా చిత్రాలు నిర్మించే వారికి తోడ్పడుతుందని భావిస్తున్నానన్నారు. ప్రజా గాయకురాలు విమలక్క మాట్లాడుతూ ప్రేమ్ రాజ్‌ను తాను సొంత తమ్ముడిలా భావిస్తానన్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ఓదార్చిన మంచి మనసున్న మనిషి ప్రేమ్‌రాజ్ అని ఆమె పేర్కొన్నారు.

ఈ స్టూడియో ఔత్సాహిక కళాకారులకు వేదికగా మారాలని తాను కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు. స్టూడియో అధినేత ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ ఒక దర్శకుడిగా తనకు నిర్మాతల కష్టాలు తెలుసీనీ అన్ని సౌకర్యాలతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్టూడియోను తీర్చిదిద్దినట్టు ఆయన చెప్పారు. స్టూడియో ప్రారంభించే నాటికి ఎంతోమంది నిర్మాతలు తమ సీరియల్స్ సినిమాల కోసం స్టూడియోను బుక్ చేసుకోవడం చూస్తే తన లక్ష్యం నెరవేరినట్లు అనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్టూడియో భాగస్వాములు వింజమూరి మధు, అరుణకుమార్, దర్శకులు చంద్రమహేష్, భరత్ పారేపల్లి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వడ్లపట్ల మోహన్, నటుడు ఇంద్రనీల్, ఆరూ రి సుధాకర్, మహేష్ బొల్లారం, జిలుకర శ్రీనివాస్, పసునూరి రవీందర్, నలిగంటి శరత్, పి.ఎన్.మూర్తి, బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Hyderabad Film Studio start
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News