Thursday, May 2, 2024

గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశాం: సిఎండి రఘుమారెడ్డి

- Advertisement -
- Advertisement -

Hyderabad ganesh nimajjanam 2021

మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో 19న నిర్వహించే గణేష్ విగ్రహల శోభాయత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని, దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంస్థ సీఎండి జి. రఘుమారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జనం చేసే అన్ని చెరువులు, కుంటల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా కోసం అదనంగా 500 కేవీ సామర్ధం గల ట్రాన్స్‌ఫార్మర్లను, 315 కేవీ సామర్థం గల 29 ట్రాన్స్‌ఫార్మర్లు అదే విధంగా 160 కేవీ(కిలో వాట్ల సామర్థంం )గల ట్రాన్స్‌ఫార్మర్లను 5లతో పాటు 35 కిలో మీటర్ల ఎల్‌టి కేబుళ్ళను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.దీనికి తోడు రోడ్ క్రాసింగ్‌లు, వదులుగా ఉన్న తీగలను సరి చేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ ఉండేలా చూడమే కాకుండా అవసరమైన చోట ఇన్సులేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఇనుపస్తంభాల, ప్యూజ్ బాక్స్‌లు ఉన్న చోట పివీసీ ప్లాస్టిక్ పీట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు ః గ్రేటర్ హైదరాబాద్‌లో సర్దార్ మహాల్, హుస్సేన్ సాగర్, బషీర్‌బాగ్, గాంధీనగర్, సరూర్‌నగర్, వంటి ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించే విద్యుత్ సరఫరా తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు సంస్థ ఆపరేషన్ డైరక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.
సూపరింటెండెంటింగ్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజీనర్లు తమ పరిధిలో పెద్దచ విగ్రహలు ప్రతిష్టించిన మండపాలను, ఆ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే వీదులను రహదారులను, తప్పనిసరిగా తనిఖీ చేయాడమే కాకుండా ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రధానంగా విద్యుత్ భద్రతపై దృష్టి పెట్టిన సీఎంది అధికారులకు పలు సూచనలు చేశారు.* సెక్షన్ ఆఫీసర్స్ తరచు తమ పరిధిలో గల గణేష్ మండపాలకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలని, విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ, మండప నిర్వహకుని వివరాలు, ఆ విగ్రహాన్ని తరలించే దారి వెంట ఉన్న వివరాలన్నీ సేకరించాలి.
* ప్రతి మండపం వద్ద ఒక ఉద్యోగిని నియమించాలని , విగ్రహ నిమజ్జనం పూర్తయ్యేవరకు విగ్రహం వెంట ఉండాలని లిఖిత
పూర్వక ఆదేశాలు చేయాలన్నారు.
* రహదారులకు అడ్డంగా ఉన్న ఎల్‌టి /11 కేవీ విద్యుత్ తీగలు తొలగించాలని, ఒక వేళ కేబుల్,ఇంటర్నెట్, ఫోన్ వంటి తీగలు అడ్డంగా ఉంటే వాటిని వెంటనే తొలగించాల్సిందిగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలి.
* ఇనుప స్తంభాలకు కొంత ఎత్తువరకు పివీసీ పైపులను అమర్చాలని, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫీడర్ పిల్లర్ బాక్స్‌లకు అపాయమని తెలిసే రేడియం స్టిక్టర్లను అమర్చాలన్నారు.
* ప్రతి ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ( ఓ అండ్ ఎం) సిబ్బంది వద్ద హెల్మెట్, ఎర్త్‌రాడ్,టంగ్ టెస్టర్, గ్లౌసెస్, వాకీ టాకీ, ఇన్సులేషన్ రేప్ ,రైన్ కోట్ వంటి వాటవి తప్పనిసరిగా ఉండాలే చాడాలి.
* సెక్షన్ అధికారులు తమ పరిధిలోని విగ్రహాలు, నిమజ్జనం అయ్యేవరకు మండప నిర్వాహకులు,పోలీస్ వారితో సమన్వయం చేసుకుంటూ ఉండాలి. విద్యుత్ సంబంధించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.
*ముఖ్యమైన నిమజ్జన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన జనరేటర్ వాటి కనెక్షన్లను సైతం పరిశీలించి, ఎటువంటి లీకేజ్‌లు లేకుండా
ఇన్సులేషన్ ఏర్పాటు చేయాలి.
గణేష్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే 24 ముఖ్య ప్రాంతాల వద్ద చీఫ్ జనరల్ మేనేజర్ / సూపరిండెంటింగ్ ఇంజనీర్ స్థాయి అధికారులను ఇంచార్జ్‌లుగా నియమించినట్లు సీఎండి తెలిపారు. ఇన్‌చార్జ్ అధికారులు వివరాలు
ప్రాంతం అధికారి పేరు
ఎన్టీర్ మార్గ్ ప్రాజెక్ట్ డైరక్టర్ టి. శ్రీనివాస్
ట్యాంక్‌బండ్ ఆపరేషన్స్ డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి
బంజరాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్స్‌లకు డైరక్టర్ మదన్ మోహన్‌రావు
సంజీవయ్య పార్క్ జి.గోపాల్ రెడ్డి ( డైరక్టర్)
ఐడిఎల్ రంగారెడ్ది ప్రాంతానికి కె.రాములు ( డైరక్టర్)
సరూర్‌నగర్ జి.పర్వతం ( డైరక్టర్ )
చార్మినార్ ఎస్. స్వామిరెడ్డి( డైరక్టర్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News