95 ఆపరేషన్స్‌తో కాపాడింది 923.14 ఎకరాలు
12 మంది బిల్డర్స్, వర్టెక్స్, వాసవిపైనా కేసులు
భూ కబ్జాల్లో రాజకీయ నేతలు, రౌడీషీటర్లు, అధికారులు
గాజులరామారంలో కూల్చింది తాత్కాలిక నిర్మాణాలు
ఇండ్లు నిర్మించుకుని నివాసముంటే హైడ్రా కూల్చదు మీడియాతో హైడ్రా కమిషనర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: ప్రభుత్వ భూముల పరిరక్షణలో 581 ఆక్రమణలను తొలగించడం ద్వారా రూ. 50 వేల కోట్ల విలువచేసే 923.14 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా ప్రధాన కార్యాలయంలో మీడియాతో రంగనాథ్ మాట్లాడుతూ.. బిల్డర్స్ తో హైడ్రా ఎక్కడా లాలూచి పడలేదని, 12 మంది పెద్ద బిల్డర్స్‌పై కేసులు బుక్ చేశామని, అధికారులపై కూడా ఫిర్యాదులు చేయడం జరిగిందని, గండిపేట పరిధిలో తప్పుడు రిపోర్డు ఇ చ్చిన ఇరిగేషన్ అధికారులపై కేసులున్నాయని తేల్చిచెపారు. అన్ని విషయాలు హైడ్రాకు అపాదించడం సరికాదనీ, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, హైడ్రాకు ఉన్న అధికారాల మేరకు, హైడ్రా పరిధిలో పనిచేస్తుందే తప్ప రెవెన్యూ, తరువాయి 8ల జీహెచ్‌ఎంసి, ఇరిగేషన్ వంటి విభాగాలకు సంబంధించిన విషయాలను హైడ్రాకు రుద్దడం మానుకోవాలని రంగనాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్కులు, నాలాలు, చెరువులను కబ్జాచేసి కట్టిన ఆక్రమణలను రాజీ లేకుండా కూల్చివేశామని, వీటిని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. చెరువులు సమాజ ఆస్తులని.. వాటిని కాపాడే బాధ్యత తమపై ఉందనీ, వీటిని భవిష్యత్తు తరాలకు కనీసంగా 100 సంవత్సరాల వరకు ఉండేలా పునరుద్దరిస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్(టిసియుఆర్) 2055 చ.కి.మీలుగా ఉన్న హైడ్రా పరిధిలో జీహెచ్‌ఎంసి 150 వార్డులు, 7 మునిసిపల్ కార్పోరేషన్‌లు, 20 మునిసిపాలిటీల విస్తరిత ప్రాంతపు ప్రభుత్వ భూముల్లోని కబ్జాలను తొలగించినట్టు రంగనాథ్ తెలిపారు. వర్టెక్స్, వాసవీ బిల్డర్స్‌తో తాము రాజీపడలేదని చెప్పుకొచ్చారు. వార్టెక్స్‌పై మొదట కేసుపెట్టింది హైడ్రానే . ముసాపేట్‌లో నాలా ఎంక్రోచ్ చేస్తే వాసవిపై కూడా కేసుపెట్టాం. వర్టేక్స్ విషయంలో కాల్ డేటా తీస్తే నిజాలు బయటకు వస్తాయి.
2024, జులై 19న హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆక్రమణలను తొలగిస్తున్నామని వెల్లడించారు. 424 ఎకరాలను హైడ్రా కాపాడినట్లు కమిషనర్ రంగనాత్ తెలిపారు. చెరువుల్లో ఆక్రమణలను కూల్చివేయడంతో 233 ఎకరాలను, రోడ్లలోని ఆక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడం ద్వారా 218.30 ఎకరాలను, పార్కుల్లోని కబ్జాలను కూల్చివేడయంతో 25.65 ఎకరాలను, నాలా ఆక్రమణలను తీసివేయడం ద్వారా 15 ఎకరాలు, అనుమతులు లేకుండా కట్టడాలను, ఆక్రమణలను తొలగించడంతో 7.14 ఎకరాలను, ఫుట్‌పాత్ ఆక్రమణలను తీసివేయడం ద్వారా 0.05 ఎకరాలు ఇప్పటి వరకు 95 ఆపరేషన్స్ చేసిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. హైడ్రా ప్రజావాణికి 5,000 ఫిర్యాదులు వస్తే అందులో 75 శాతం పరిష్కరించినట్టు తెలిపారు. 50, 60 ఏళ్ల నుంచి చెరువులు కబ్జా అవుతున్నాయనీ, హైడ్రా 14 నెలల నుంచి చెరువుల ఆక్రమణలు తొలగిస్తుందన్నారు. చెరువుల్లో డంపింగ్‌పై 75 కేసులు పెట్టామని రంగనాథ్ చెప్పారు.
గాజుల రామారం కబ్జాలో..
గాజులరామారంలో ల్యాండ్ గ్రాబర్స్ అడ్డగోలుగా కబ్జా చేశారని, రౌడీషీటర్లు, అధికారులు, రాజకీయ నేతలు వీటి వెనుక ఉన్నారని తెలిపారు. 317 ఎకరాలకు పైగా కబ్జా చేశారని, 900లకుపైగా ఇళ్ళు ఉన్నాయని వెల్లడించారు. 260 ఇళ్ళు కూల్చామని.. 640 ఇళ్ళు కూల్చలేదని రంగనాథ్ వివరించారు. కొందరు స్థానిక రౌడీ షీటర్లు కబ్జా చేసి.. చిన్న చిన్న గదులు నిర్మించి అందులో పేదవారికిచ్చి వాటిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఎదురు డబ్బులు ఇస్తూ ఆ ఇళ్లల్లో ఉంచుతున్నారు. కొందరు డబ్బులు పెట్టి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ముందుకొచ్చి ఎవరి నుంచి కొన్నారో చెబితే.. వారికి న్యాయం చేయడానికి హైడ్రా సిద్ధమనీ, కబ్జాలు తొలగించే సమయంలో కొందరు చిన్న పిల్లలతో వీడియోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. గాజులరామారంలో ఎవ్వరికి టైం ఇవ్వలేదు. హైడ్రా ఎవరి ఇంటికి కరెంటు కట్ చేయలేదు. నివాస గృహలను ఎక్కడ కూడా కూల్చివేతలు చేపట్టలేదు. నివాస గృహలను హైడ్రా కూల్చదు. గతంలో రెవెన్యూ వాళ్ళు అనేక సార్లు నోటీసులు ఇచ్చారు. కబ్జా చేసిన పొలిటిషన్స్ పేర్లు గవర్నమెంట్ కి ఇచ్చాము. రౌడీషీటర్లపై కేసులు పెట్టించామన్నారు. ఫాతిమా కాలేజ్ సల్కం చెరువు ప్రిలిమినరి నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. ఫైనల్ ప్రిలిమినరి నోటిఫికేషన్ పూర్తి అయ్యాక ఎం చేయాలో చేస్తాం.అని రంగనాథ్ తెలిపారు.
క్లౌడ్ బరస్ట్..
ఈ మధ్య కాలంలో గ్రేటర్‌లోనే క్లౌడ్ బరెస్ట్ జరుగుతుంది. మొన్న కుత్బుల్లాపూర్‌లో 18 సెంమీ.లు వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం హైదరాబాద్‌లో కురుస్తుంది . నాలాల పునరుద్దరణ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే 100 ఏళ్ల కు అనుగుణంగా నాలా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం 51 టీమ్స్ ఉన్నాయి. వాటిని 71 డిఆర్‌ఎఫ్ టీమ్స్‌గా పెంచాలని ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. ఇంకా నాలాల్లో డీ సిల్టింగ్ చేయాలి. అందుకోసం డీ సిల్టింగ్‌కు హైడ్రా పెద్ద పీట వేయాలని నిర్ణయించాం. నాలాల్లో మొన్న ముగ్గురు కొట్టుకుపోయారు.. అందులో ఒక్కరి బాడీ వలిగొండలో దొరికింది..మిగతా వారి కోసం హైడ్రా తీవ్రంగా శ్రమించింది.. ఫ్లోటింగ్ ఎక్కువ గా ఉండడం తో ఇంకా దొరకలేదు. గేట్లు కూడా తెరవడంతో ఎక్కడో ఓ చోట దొరికే అవకాశం ఉంది’. అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.
Also Read: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌ఘడ్ సర్కార్ అంగీకారం