Sunday, April 28, 2024

యడియూరప్ప రాజీనామా గురించి నాకు తెలియదు

- Advertisement -
- Advertisement -
I don't know about Yediyurappa's resignation says Pralhad Joshi
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టీకరణ

హుబ్బలి: కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప స్థానంలో బాధ్యతలు చేపట్టడం గురించి బిజెపి అధినాయకత్వం తనతో చర్చించలేదని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల ప్రకారం ఈ నెల 25న తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ముఖ్యమంత్రి ఎడియూరప్ప ఇదివరకే తెలిపిన నేపథ్యంలో విలేకరులతో జోషి మాట్లాడుతూ పార్టీ కేంద్ర నాయకత్వం పదవికి రాజీనామా చేయవలసిందిగా యడియూరప్పను ఆదేశించిన విషయం తనకు తెలియదని చెప్పారు. దీని గురించి ఎవరూ తనతో మాట్లాడలేదని, మీడియా మాత్రమే దీనిపై మాట్లాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారా అన్న ప్రశ్నకు ఊహాజనిత ప్రశ్నలకు తాను జవాబివ్వబోనని ఆయన స్పష్టం చేశారు. అత్యున్నత నాయకులైన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సారథ్యంలోని పార్టీ నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటారని జోషి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News