Thursday, August 7, 2025

నాకు అవకాశం వస్తే.. కచ్చితంగా అకీరాతో సినిమా చేస్తాను: విశ్వప్రసాద్

- Advertisement -
- Advertisement -

పవన్‌కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ ఎప్పటినుంచో ఎధురు చూస్తున్నారు. అతడిని పరిచయం చేసేందుకు కొందరు డైరెక్టర్లు, నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటి అవకాశం వస్తే తాను కూడా వదులుకోనని నిర్మాత టిజి విశ్వప్రసాద్ (Vishwaprasad) అన్నారు. ప్రస్తుతం ఆయన ‘ది రాజాసాబ్’ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వప్రసాద్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వచ్చిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం కోసం విశ్వ ప్రసాద్ సహాయం చేశారు. దీంతో అకీరాతో సినిమా కోసమే సహాయం చేశారని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

‘‘అకీరాతో సినిమా చేయాలని చేయాలని అందరు నిర్మాతలకు ఉంటుంది. నాకు అవకాశం వస్తే నేను కచ్చితంగా చేస్తాను. అయిన ఎవరితో సినిమా చేయాలని అకీరానే నిర్ణయం తీసుకుంటాడు. ఆ విషయంలో వచ్చే వార్తలు చాలానే ఉన్నాయి. నేను హరిహర వీరమల్లుకు సాయం చేయలేదు. నిర్మాత ఎఎం రత్నంకి అవసరం ఉందని చేశాను. ఆ సమయంలో నన్ను చూసిన పవన్‌.. వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకలలో నాకు థ్యాంక్స్ చెప్పారు. అంతేకానీ, అకీరా సినిమా కోసం సామం చేశానన్న మాట అవాస్తవం’’ అని విశ్వప్రసాద్ (Vishwaprasad) వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News