Thursday, May 2, 2024

బ్యూటీఫుల్ రొమాంటిక్ మెలోడీ

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా వున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. గురువారం మేకర్స్ థర్డ్ సింగిల్ ‘ఇచ్చేసుకుంటాలే’ పాటని విడుదల చేశారు. బ్యూటీఫుల్ రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని కంపోజ్ చేశా రు జీవి ప్రకాష్.

భాస్కరభట్ల రవికుమార్ అందించిన సాహిత్యం.. హీరోయిన్ మనసులోని ప్రేమని చాలా అందంగా ఆవిష్కరించింది. సింధూరి మైమరపించే గాత్రంతో ఆకట్టుకున్నారు. ఈ పాటలో రవితేజ, గాయత్రి భరద్వాజ్ ల కెమిస్ట్రీ వండర్‌ఫుల్‌గా వుంది. నూపుర్ సనన్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా సందర్భంగా ఈనెల 19న అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News