Saturday, April 27, 2024

రొమాంటిక్ ‘మిస్టర్ బచ్చన్’

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’లో ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సేతో అందమైన లవ్ ట్రాక్ ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ రవితేజ, భాగ్యశ్రీ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నట్లు చూపించే రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ కారంపూడిలో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, అయనంక బోస్ డీవోపీగా చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News