Wednesday, May 8, 2024

ఐసిఎస్‌ఇ, ఐఎస్‌సి పరీక్షలు వాయిదా

- Advertisement -
- Advertisement -

కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ఐసిఎస్‌ఇ బోర్డు పరీక్షలు వాయిదా పడ్డాయి. కొవిడ్ పరిస్థితు లను దృష్టిలో ఉంచుకొని మే 4 నుంచి జరగాల్సిన ఐసిఎస్‌ఇ 10, ఐఎస్‌సి 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసినట్టు ద కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామి నేషన్స్ ఒకప్రకటనలో వెల్లడించింది. కొవిడ్ పరిస్థితులను నిశితంగా పరిశీలించిన తర్వాత జూన్ తొలి వారంలో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం వెల్లడిస్తా మని స్పష్టం చేసింది. ఐఎస్‌సి 12వ తరగతి విద్యార్థులకు తేదీలను ప్రకటించిన అనంతరం పరీక్షలు నిర్వహించనుండగా, ఐసిఎస్‌సి 10వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఆఫ్‌లైన్ పరీక్షకు హాజరు కాలేకపో తే తరగతి విద్యార్థులకు బోర్డు ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే సిబిఎస్‌ఇ పది పరీక్షలు రద్దు కాగా, 12వ తరగతి పరీక్షలను కేం ద్రం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ICSE and ISC exams 2021 postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News