Monday, April 29, 2024

లింగోజిగూడలో పోటీకి టిఆర్‌ఎస్ దూరం

- Advertisement -
- Advertisement -

TRS decides to not contest in Lingojiguda election

లింగోజిగూడ కార్పొరేటర్ ఏకగ్రీవానికి టిఆర్‌ఎస్ గ్రీన్ సిగ్నల్
కృతజ్ఞతలు తెలిపిన బిజెపి నేతలు
మనతెలంగాణ/హైదరాబాద్: లింగోజిగూడ డివిజన్‌కు ఈ నెల 30న జరుగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బిజెపి నేతల విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. లింగోజిగూడ ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బిజెపి మాజీ ఎంఎల్‌సి రామచందర్ రావు నేతృత్వంలో ఒక బృందం శుక్రవా రం నాడు ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బిజెపి కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మరణించడం దురదృష్టకరమని, వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ పెట్టవద్దని బిజెపి నుండి వచ్చిన విజ్ఞప్తిని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్ళి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్‌కు బిజెపి ప్రతినిధి బృందం,ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి కెటిఆర్‌ని కలిసిన వారిలో ఎల్‌బినగర్ ఎంఎల్‌ఎ శ్రీదేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా అభ్యర్ధిని నిలపకుండా ఏకగ్రీవ ఎన్నికకు కలసి రావాలని పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి కెటిఆర్ శుక్రవారం ఫోన్ చేసి కోరారు.

TRS decides to not contest in Lingojiguda election

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News