Tuesday, April 30, 2024

గంగూలీ ఐసిసి అధ్యక్షుడైతే… నిషేధంపై అప్పీల్‌ చేస్తా

- Advertisement -
- Advertisement -

If Ganguly becomes President of ICC will appeal ban

 

పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా

ఇస్లామాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఒక వేళ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడిగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌గంగూలీ ఎన్నికయితే తన నిషేధాన్ని తొలగించాలని ఆయనను కోరుతానని చెప్పాడు. ఆదివారం ఓ లోకల్ చానెల్‌లో మాట్లాడిన కరేరియా .. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు( పిసిబి) తనపట్ల కుట్ర పూరితంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక వేళ గంగూలీ ఐసిసి చైర్మన్‌గా ఎన్నికయితే తనకు న్యాయం చేస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేయాలని పాక్ క్రికెట్ బోర్డులోని ప్రతిఒక్కరి కాళ్లా వేళ్లా పడ్డానని, అయినా ఏ ఒక్కరూ కనికరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కూడా ఎన్నోసార్లు తన సమస్యను విన్నవించానని, మాజీ క్రికెటర్ అయి ఉండి కూడా ఆయననుంచి సానుకూల స్పందన కరువైందని వాపోయాడు. ఇప్పటికే ఐసిసిలోని అనేక మంది పెద్దలను కలిశానని, ఏ ఒక్కరు కూడా తనను ఆదుకోలేదని కనేరియా చెప్పాడు. గంగూలీ తన బాధను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఒక వేళ ఇప్పుడు తనపై నిషేధం ఎత్తివేసినా ప్రస్తుతం మైదానంలోకి దిగే ఆలోచన తనకు లేదని, పాక్ పౌరుడిగా గౌరవం దక్కితే చాలని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కనేరియా గంగూలీపై ప్రశంసల వర్షం కురిపించాడు.

కాగా,2009 ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు లెగ్‌స్పిన్నర్ డానిష్ కనేరియాపై పాక్ క్రికెట్ బోర్డు జీవిత కాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు( ఇసిబి) విధించిన బహిష్కరణపై కనేరియా చేసుకున్న అపీలును తిరస్కరించిన పిసిబి నిషేధాన్ని సమర్థించింది. 61 టెస్టుల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించిన కనేరియా 261 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా, గంగూలీ ఐసిసి చైర్మన్ రేసులోకి వచ్చాడంటూ ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News