Saturday, April 27, 2024

ఏ ఐటమ్ సాంగ్ చేయడం లేదు

- Advertisement -
- Advertisement -

ఐటమ్ సాంగుల్లో డ్యాన్స్ చెయ్యడం వల్ల తన కెరీర్‌కి ఎటువంటి లాభం కలగదని పాయల్ రాజపుత్ గ్రహించింది. అందుకే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ అంటే భయపడుతోంది. లేటెస్ట్‌గా తన పేరు ‘బంగార్రాజు’ సినిమా ఐటమ్ సాంగ్ విషయంలో వినిపించింది. ఈ ప్రచారం ఎక్కువ కావడంతో ఆమె వెంటనే స్పందించింది. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది సూపర్ హిట్టయిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకి సీక్వెల్. ఈ సీక్వెల్‌లో పాయల్ ఐటమ్ సాంగ్ చేయనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. దాంతో ఈమె సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. “నేను ఏ ఐటమ్ సాంగ్‌లోనూ కనిపించబోవడం లేదు. ఇది చెప్పాలనేదే ఈ పోస్ట్‌” అంటూ ఆమె వివరణ ఇచ్చింది. ‘బంగార్రాజు’ పేరెత్తకుండా ఆ రూమర్లకు చెక్ పెట్టింది. పాయల్ రాజపుత్‌కి ప్రస్తుతం క్రేజ్ తగ్గింది. ఆర్ ఎక్స్ 100, వెంకీ మామ సినిమాలు తప్ప ఆమెకు పెద్దగా హిట్స్ లేవు. దాంతో ఈ బ్యూటీ కెరీర్ నత్త నడకన సాగుతోంది.

I’m not doing any special song: Payal Rajput

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News