Sunday, April 28, 2024

భారత్ జిడిపి 6.3 శాతం… అంచనాను పెంచిన ఐఎంఎఫ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో భారతదేశ జిడిపి 6.3 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం, ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో భారత్‌లో చాలా బలమైన వినియోగం ఉంది, ఆ తర్వాత ఐఎంఎఫ్ జిడిపి అంచనాను పెంచాలని నిర్ణయించింది. అంతకుముందు ఐఎంఎఫ్ జిడిపి 6.1 శాతంగా అంచనా వేసింది.

ఇటీవలి కాలంలో అనేక అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు అంచనాలను పెంచాయి. అక్టోబరు 6న ఆర్‌బిఐ సమీక్షలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాల్లో ఐఎంఎఫ్ ఎలాంటి మార్పులు చేయలేదు. 2024-25లో జిడిపి 6.3 శాతంగా ఉండవచ్చని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్ ఎకనామిక్ ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, 20232024 మధ్య రెండు సంవత్సరాలలో భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి, బలమైన వినియోగం కారణంగా వృద్ధి రేటు 6.3 శాతంగా అంచనా వేశారు. ఈ అంచనా 0.2 శాతం పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి బ్రెజిల్, రష్యా, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు అంచనాలను పెంచింది. అయితే చైనా వృద్ధి రేటు అంచనా 0.2 శాతానికి తగ్గించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News