Friday, May 3, 2024

ఉపశమనం కోసమే తక్షణ ఆర్థిక సహాయం: మేయర్

- Advertisement -
- Advertisement -

Immediate financial assistance for relief of victims

హైదరాబాద్: సర్వం కొల్పోయిన బాధితులకు ఉపశమనం కల్పించడమే లక్షంగా ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ. 10వేలను అందజేస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. వరద ముంపు బాధితులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం పంపిణీ యుద్ద ప్రతిపాదికన కొనసాగుతోంది. బుధవారం నగర వ్యాప్తంగా వరద బాధితులకు ఎక్కడికక్కడ ఆర్ధిక సహాయం పంపిణీ చేశారు. తద్వారా బాధితులకు మేమున్నాం అంటూ ప్రభుత్వం పూర్తి భరోసాను కల్పిస్తోంది. ఉప్పల్ నియోజవర్గంలోని ఉప్పల్, కాప్రా సర్కిళ్లలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిలు వరద ప్రాంతాలను పరిశీలించి బాధితులకు తక్షణ సహాయం కింద రూ.10వేలను అందజేశారు. మేయర్, ఎమ్మెల్యే ముందుగా నాచారంలోని నీట మునిగిన హెచ్‌ఎంటి కాలనీలో పేదలు ఉండే గుడిసెలను సందర్శించారు.

ఈ సందర్భంగా వారు గుడిసెవాసులను పరామర్శించిన వారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన తక్షణ సహాయం కింద రూ.10 వేల నగదును అందజేశారు. ఆ తర్వాత మల్లాపూర్, చర్లపల్లి, ప్రాంతాల్లో మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు వరద కారణంగా ఇళ్లలోని వస్తువులతో గృహోపకరణాలు, ఫర్నచర్‌తో సహా సర్వం కొల్పోయ్యామని మేయర్ , ఎమ్మెల్యేల ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో బాధితులకు ఉపశమనం కల్పించేందుకుకే ప్రభుత్వం రూ.10వేల ఆర్ధిక సహాయాన్ని అందజేస్తోందని, భారీ విపత్తును ఎదుర్కొన్న ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, పురపాలక శాఖ మంత్రి కె.తారాక రామారావులు తక్షణమే స్పందించి అన్ని చర్యలు చేపట్టారన్నారు. ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ వరద కారణంగా ఉప్పల్ ప్రాంతం బాగా దెబ్బతినడంతో తనతో పాటు మేయర్, కార్పోరేటర్లు, అధికారులు రేయింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంటూ సహాయ పునరావాస చర్చల్లో పాల్గొన్నమని తెలిపారు. రద ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు.

Immediate financial assistance for relief of victims

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News