Sunday, April 28, 2024

గ్రేటర్ నగరంపై డెంగీ ఛాయలు

- Advertisement -
- Advertisement -

Impact of Dengue on Greater Hyderabad

మూడు రోజులుగా 65 అనుమానిత కేసులు నమోదు
9మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడి
జీహెచ్‌ఎంసి నివారణ చర్యలు చేపట్టాలంటున్న వైద్యాధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల ద్వారా వ్యాధి నిర్థ్దారణ

హైదరాబాద్: గ్రేటర్ నగరంపై వ్యాధులు పంజా వి సురుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రజలు వణికిపోగా, ఇటీవల కురుస్తున్న వానలకు సీజనల్ వ్యాధులు విజృంభణ చేస్తున్నారు. తాజాగా డెంగీ కేసులు నమోదైతున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వ్యాధులు రాకుండా ఎన్ని చర్యలు చేపట్టిన వాతావరణ మా ర్పులు, ప్రజలు అజాగ్రత్తగా ఉండటంతో కొత్త రోగాలు ఉనికి చాటుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నగరంలో 65 డెంగీ అనుమానిత కేసులు నమోదులో కాగా అందులో 09 మం ది పాజిటివ్‌గా బయటపడినట్లు వెల్లడిస్తున్నారు.

మరోపక్క వైద్యులు థర్ట్‌వేవ్ వచ్చే పొంచిఉందని, ఈసారి పిల్లలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటుండగా, డెంగీ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు వ్యాధులు విస్తరించకముందే నివారణ చర్యలు చేపట్టాలని, రెండు నెలల్లో కేసులు మరిన్ని పెరిగే చాన్స్ ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. గత నాలుగేళ్లుగా డెంగీ కేసులు పరిశీలిస్తే 2017 సంవత్సరంలో 410 మందికి, 2018లో 263 మందికి సో కగా, 2019లో 1406 మంది, 2020లో 100లోపు నమోదైనట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నారు. నగర ప్రజలు దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలుంటే వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడంతో స్టిట్ టెస్టులు చేస్తున్నారని, ఈపపత్రిలో చాలా వరకు పాజిటివ్ కేసులు వస్తాయని, ప్రభుత్వ ఆసు త్రుల్లో ఎలిజా టెస్టులు చేస్తారని, లక్షణాలు కనిపించిన వారు సర్కార్ ఆసుపత్రుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని, డెంగీను గుర్తించాలంటే ఖరీదైన యంత్ర పరికరాలు వియోగిస్తారని, అలాంటివి పేరు మోసిన కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉండవని, ప్రజలు ఉస్మానియా, గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో డెంగు నిర్థ్దారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

గత 15 రోజుల నుంచి సీజనల్ వ్యాధులు పెరగడంతో నగరవాసులు బస్తీదవఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు పెద్ద ఎత్తున వైద్య చికిత్సల కోసం వస్తున్నట్లు, డెంగీ అనుమానిత కేసులు రావడంతో వైద్యాధికారులు టెస్టుల కోసం పరికరాలు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

డెంగీ కేసులు పెరిగితే వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తాం: జిల్లా వైద్యాధికారులు

వాతావరణ మార్పులో పలు రకాల సీజనల్ వ్యాధులు భయపెట్టిస్తాయని, మూడు నెలల పాటు ప్రజలు వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించాలని, అదే విధంగా వైద్యసిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి సేవలందించేలా చర్యలు తీసుకుంటామని జి ల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈసారి డెంగీ కేసులు పెరిగితే తగిన చర్యలు తీసుకుంటున్నట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News