Saturday, April 27, 2024

అమెరికాలో కేబినెట్ సభ్యుడిపై అభిశంసన

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్‌పై ప్రవేశ పెట్టిప అభిశంసన తీర్మానం అక్కడి ప్రతినిధుల సభలో నెగ్గింది. దాదాపు 150 ఏళ్లలో ఓ కేబినెట్ సభ్యుడిపై ఈ విధంగా జరగడం ఇదే తొలిసారి. అమెరికామెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలను నివారించడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపిస్తూ రిపబ్లికన్లు ఈ తీర్మానం ప్రవేశ పెట్టారు.

రిపబ్లికన్ పార్టీకి పట్టున్న ప్రతినిధుల సభలో అతి స్వల్ప మెజార్టీతో (214213) వారు పైచేయి సాధించారు. ఈ అంశం ఇప్పుడు డెమోక్రాట్ల ఆధిక్యం ఉన్న సెనేట్‌కు చేరుతుంది. అక్కడ నెగ్గితేనే మయోర్కాస్ అభిశంసన అమలు లోకి వస్తుంది. ఆయనకు మద్దతుగా ఓటు వేసిన వారిలో ముగ్గురు రిపబ్లికన్ సభ్యులూ ఉన్నారు. మోపిన అభియోగాలు అభిశంసన స్థాయివి కాదని, దీని వల్ల రాజ్యాంగ విలువలు దెబ్బతింటాయని వారు చెప్పారు. పైగా దీనివల్ల అక్రమ వలసల సమస్య పరిష్కారం కాదని వివరించారు.

అధ్యక్షుడు జో బైడెన్ మండిపాటు
మయోర్కాస్‌పై ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై అధ్యక్షుడు జోబైడెన్ తీవ్రంగా మండిపడ్డారు. దీన్ని రాజ్యాంగ విరుద్ధ చర్యగా విమర్శించారు. రిపబ్లికన్లది రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు. మయోర్కాస్ గౌరవప్రదమైన పబ్లిక్ సర్వెంట్ అని కొనియాడారు. శరణార్ధిగా కుటుంబంతో అమెరికాకు వచ్చిన ఆయన రెండు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని, చట్టాన్ని నిబద్ధతతో అమలు చేశారని పేర్కొన్నారు. మరోవైపు దేశ సరిహద్దులను రక్షించటంలో మయోర్కాస్ విఫలమయ్యారని రిపబ్లికన్లు ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన స్పీకర్ మైక్ జాన్సన్ కూడా అభిశంసనను సమర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News