Friday, May 3, 2024

తెలంగాణ ప్రభుత్వంలోనే సంగారెడ్డి మున్సిపల్‌కు మహర్దశ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: సిఎం కెసిఆర్ పాలనలో పట్టణాలు వేగంగా అభివృద్ధ్ది చెందాయని, రాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కృతజ్ఞతతో ఉన్నారని తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 9ఏళ్ల పాలనలో సంగారెడ్డి మున్సిపాల్టీకి సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో నిధులను ఇచ్చి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, సిసి రోడ్లు, లైటింగ్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సంగారెడ్డి మున్సిపాల్టీకి అధికంగా నిధులను అందజేశారన్నారు. నీటి కొరత లేకుండా పట్టణంలో ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు.

గత ప్రభుత్వ పాలనలో సంగారెడ్డి పట్టనంలో చినుకు పడితే నీట మునిగే పరిస్థితి ఉండేదని, రూ. 7కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధ్ది చేసి పట్టణాన్ని నీటమునగకుండా కృసి చేశామన్నారు. మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి మాట్లాడుతూ 2014తర్వాత సంగారెడ్డి పట్టణానికి మహర్దశ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లతవిజేందర్‌రెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్, జడ్‌పిటిసిలు సునీత మనోహర్‌గౌడ్, కొండల్‌రెడ్డి, కంది ఎంపిపి సరళ పుల్లారెడ్డి, కౌన్సిలర్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News