Tuesday, May 7, 2024

చిన్నారులకు టీకాలో కొవోవాక్స్‌నూ చేర్చండి

- Advertisement -
- Advertisement -

Include Covovax in vaccine for children

కేంద్రానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభ్యర్థన

న్యూఢిల్లీ: 12 ఏళ్లు పైబడిన చిన్నారులకు ఇచ్చే కొవిడ్ టీకా కార్యక్రమంలో తమ సంస్థ ఉత్పత్తి చేసే కొవోవాక్స్‌ను కూడా చేర్చాలని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. కొవోవాక్స్‌ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.900ప్లస్ జిఎస్‌టికి విక్రయించాలని తమ సంస్థ అనుకుంటోందని, కేంద్రానికి కూడా సరఫరా చేయడానికి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని పుణెకు చెందిన ఈ సంస్థ తెలిపింది. అయితే కేంద్రానికి సరఫరా చేసే టీకా ధరను మాత్రం ఆ సంస్థ పేర్కొనలేదు. కొవోవాక్స్‌కు కొన్ని షరతులకు లోబడి 12నుంచి 17 ఏళ్ల లోపువారికి ఇవ్వడానికి ఈ నెల 9న డ్రగ్స్ రెగ్యులేటర్ పరిమిత అత్యవసర అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అలాగే 18 ఏళ్ల పైబడిన వారికీ ఈ టీకా ఇవ్వడానికి గత డిసెంబర్ 28న అత్యవసర అనుమతులు ఇచ్చింది.

కాగా తమ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, పిల్లలకు కొవోవాక్స్ టీకా ఇవ్వాలని పలు ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు తమను కోరుతున్నాయని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ, రెగ్యులేటరీ వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌కు రాసిన లేఖలో తెలిపినట్లు ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు. అంతేకాకుండా ప్రైవేటు ఆస్పత్రులకు జిఎస్‌టి కాకుండా రూ.900కు ఈ టీకాను విక్రయించాలని కూడా తమ సంస్థ నిర్ణయించినట్లు ఆయన ఆ లేఖలో తెలిపారు. అంతేకాకుండా భారత ప్రభుత్వానికి సరఫరా చేయడానికి మీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని కూడా ఆ సంస్థ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News