Tuesday, April 30, 2024

తమిళనాడులో ఐటి బృందంపై స్థానికుల దాడి

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు రాష్ట్ర విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ సంబంధిత వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ దశలో ఐటి బృందంపై దాడులు జరిగాయి. సెంథిల్, ఆయన సోదరుడు, కొందరు బంధువులు, స్నేహితులపై ఐటి శాఖ విస్తృత దాడులు సంచలనం కల్గించాయి. కరూర్, ఈరోడ్, కోయంబత్తూరుల్లోని వీరి నివాసాలపై ఐటి సోదాలు జరిగాయి. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధృవీకరించాయి. కాగా కరూర్‌లో ఐటి అధికారుల బృందంపై సోదాల దశలో ఓ బృందం దాడికి దిగింది. వారి వాహనాన్ని ధ్వంసం చేసింది. కొందరు జరిపిన దాడిలో గాయపడ్డ ఐటి అధికారులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. ఐటి బృందం రావడం గమనించి కొందరు ముందుగా అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. తన నివాసంలో ఐటి దాడులు సోదాలు జరిగాయనే వార్తలను చెన్నైలో మంత్రి సెంథిల్ ఖండించారు.

తన సంబంధితులు ఇళ్లలో సోదాలను చేపట్టారనివివరించారు. సెంథిల్ బాలాజీ రాష్ట్రంలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. డిఎంకెలో సీనియర్ నేతగా ఉన్నారు. తాను సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో ఉన్నానని, తన పేరు వాడుకుని ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాలని, అయితే తనపై దుష్ప్రచారానికి దిగితే సహించేది లేదన్నారు. తమిళనాడులో ఏమి చేయలేని స్థితిలో బిజెపి ఇప్పుడు ఈ విధంగా ఐటితో కక్షసాధింపు చర్యలకు దిగిందని డిఎంకె వ్యవస్థాపక కార్యదర్శి , మాజీ ఎంపి ఆర్‌ఎస్ భారతీ ఆరోపించారు. ఐటి అధికారులపై డిఎంకె గూండాలు దాడికి దిగారని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు కె అన్నామలై విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. అధికార డిఎంకె జులుం పెరుగుతోందని , అధికార నిర్వహణకు వచ్చిన వారి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు.

దీనిపై డిఎంకె మండిపడుతూ కేంద్రీయ దర్యాప్తు సంస్థలను ఉసికొల్పి ఈ విధంగా విపక్షాలపై రాజకీయ కక్షకు పాల్పడటం భావ్యమేనా అని పార్టీ నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సింగపూర్, జపాన్‌లకు అధికార పర్యటనకు వెళ్లిన దశలో , రాష్ట్రంలో అధికార పార్టీ సీనియర్ నేత సబంధితుల ఇళ్లలో ఐటి దాడులు రాజకీయ ప్రకంపనలకు దారితీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News