Tuesday, May 21, 2024

చెర్నోబిల్ వద్ద పెరిగిన రేడియో ధార్మికత!

- Advertisement -
- Advertisement -

Increased radiation levels from Chernobyl

 

కీవ్: చెర్నో బిల్ అణు కర్మాగారాన్ని రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్నాక ఆ కర్మాగారం సమీపంలో సాధారంణం కంటే ఎక్కువ స్థాయిలో గామా ధార్మికశక్తి(రేడియేషన్)ని కనుగొన్నట్లు ఉక్రెయిన్ అణుశక్తి నియంత్రణ సంస్థ తెలిపింది. చెర్నోబిల్ జోన్‌లో పెరిగిన గామా రేడియేషన్ స్థాయిలను కనుగొన్నట్లు స్టేట్ న్యూక్లియర్ రెగ్యులేటరి ఇన్‌స్పెక్టరేట్ శుక్రవారం తెలిపింది. కానీ వాటి వివరాలు మాత్రం ఇవ్వలేదు. ఎక్స్‌క్లూజివ్ జోన్ ద్వారా భారీ సైనిక సామాగ్రిని తరలించినందున గాలిలోకి కలుషిత రేడియోధార్మిక ధూళి విడుదలై ‘ఉపరితల మట్టికి భంగం’ ఏర్పడిందని పేర్కొంది. రష్యా గురువారం భీకర యుద్ధం చేశాక, చెర్నోబిల్ కర్మాగారాన్ని, దాని పరిసరంలోని ఎక్స్‌క్లూజన్ జోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

చెర్నోబిల్ అణు కర్మాగారాన్ని రష్యా వైమానిక బలగాలు పరిరక్షిస్తున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ తెలిపారు. కాగా అక్కడ రేడియో ధార్మికశక్తి స్థాయిలు సామాన్యంగానే ఉన్నాయని కూడా అన్నారు. ఇదిలావుండగా చెర్నోబిల్ టేకోవర్ గురించి ఉక్రెయిన్ చెప్పింది. ‘ఆ పారిశ్రామిక ప్రదేశంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా విధ్వంసం జరగలేదు’ అని వియన్నాకు చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంది. 1986లో చెర్నోబిల్ అణు కర్మాగారంలో విపత్తు సంభవించింది. కీవ్‌కు 130 కిమీ.(80 మైళ్ల) ఉత్తరాన ఉన్న ఆ కర్మాగారంలోని న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి పేలిపోయింది. దాంతో రేడియో ధార్మిక మేఘాలు యూరొప్ అంతటా వ్యాపించాయి. అయితే ఆ రియాక్టర్ నుంచి లీకులు ఆపేందుకు ఓ రక్షణ కవచాన్ని(షెల్) దానిపై తరువాత కప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News