Saturday, April 27, 2024

చలి పంజా

- Advertisement -
- Advertisement -

 

Increasing cold intensity next 3days

వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన
ఏజెన్సీలో మంచు దుప్పటి
ఆదిలాబాద్ జిల్లా గిన్నెధరిలో 3.5డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉత్తరాది నుంచి విపరీతంగా శీతల గాలులు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. అయితే రానున్న మూడురోజులు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఉదయం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మన్యంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సాయంత్రం 5 గంటల నుంచే చలి తీవ్రత మొదలై శీతలగాలులు భారీగా వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు తెల్లవారుజామున పొగమంచు అధికంగా కురుస్తుందని వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ఎపి, తెలంగాణ ఏజెన్సీల్లో మంచు దుప్పటి

నార్త్ ఇండియాలోనే కాదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగిపోయింది. సాధారణం కంటే నాలుగు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎపి, తెలంగాణ ఏజెన్సీల్లో మంచు దుప్పటి కమ్మేసింది. ఉత్తర, ఈశాన్యం నుంచి చలిగాలులు వేగంగా వీస్తున్నాయి. దీంతో వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిన్నెదరిలో ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోగా బేలా, సిర్పూర్ (యూ)లో 3.8, అర్లి(టీ) 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే వాంకిడిలో 4.9, జైనథ్లో వాంకిడిలో 4.9, చాప్రాలో 5.1, సోనాలాలో 5.2, బజార్హత్నూర్లో 5.3, లోకిరిలో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News