Wednesday, September 24, 2025

ఇండియాఎతో రెండో టెస్టు.. ఆస్ట్రేలియాఎ 350/9

- Advertisement -
- Advertisement -

లక్నో: ఇండియాఎతో మంగళవారం ప్రారంభమైన రెండో అనధికార టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాఎ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ క్యాంప్‌బెల్ (9) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ నాథన్ మెక్‌స్వినీతో కలిసి మరో ఓపెనర్ సామ్ కొన్స్‌టాస్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ఇండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్య జట్టు బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే 91 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసి సామ్‌ను సిరాజ్ వెనక్కి పంపాడు. దీంతో 86 పరుగుల రెండో వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. తర్వాత వచ్చిన ఒలివర్ పీక్ ధాటిగా ఆడాడు.

భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఒలివర్ 39 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కూపర్(0) ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మెక్‌స్వినీ 162 బంతుల్లో 10 ఫోర్లతో 74 పరుగులు చేసి వెనుదిరిగాడు. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్స్ 5 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించిన జాక్ ఎడ్వర్డ్ 78 బంతుల్లోనే 11 ఫోర్లు, సిక్స్‌తో 88 పరుగులు చేశాడు. ఆట ముగిసే సమయానికి టాడ్ మర్ఫి (29), థ్రొంటమ్ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్ ఐదు వికెట్లను పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News