అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన గ్రూప్‌ఎ చివరి మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. 189 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
Also Read: 12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు..!
ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (8) నిరాశ పరిచాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన అభిషేక్ 15 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య (1) విఫలమయ్యాడు. అయితే అక్షర్ పటేల్, సంజు శాంసన్ అద్భుత బ్యాటింగ్‌తో స్కోరును ముందుకు తీసుకెళ్లారు. శాంసన్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, అక్షర్ దూకుడును ప్రదర్శించాడు. ధాటిగా ఆడిన అక్షర్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ 45 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్సర్లతో 56 పరుగులు సాధించాడు.