Saturday, October 12, 2024

చివరి టి20 వర్షార్పణం: సిరీస్ సమం

- Advertisement -
- Advertisement -

IND vs SA 5th T20 abandoned due to rain

బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రి కా జట్ల మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్‌కు వరుణుడు ఆటం కం కలిగించాడు. వర్షం వల్ల మ్యాచ్ రద్దయింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. తద్వారా 2010 తర్వాత ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఇండియాలో ఒక్క పరిమిత ఓవర్ల సిరీస్ (టీ20లు, వన్డే లు) కూడా ఓడిపోని రికార్డును అలాగే నిలబెట్టుకుంది. ఇక దక్షిణాఫ్రికాకై సిరీస్ గెలిచి అప్రదిష్ఠకు తెరదించాలనుకున్న టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. ఇక వైజాగ్, రాజ్ కోట్‌లలో అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చిన టీమిండియా బెంగళూరులో కూడా గెలిచి సిరీస్‌ను గెలవాలనే తాపత్ర యం వర్షం వల్ల నీరుగారింది. చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తిన వేలాది ప్రేక్షకులు వాన దేవుణ్ని తిట్టుకుంటూ స్టేడియం నుంచి ఇంటిబాటపట్టారు. ఇక 9.40వరకు ప్రేక్షకులు వానలో తడచుకుంటూనే ఎదురుచూశారు. కానీ వరుణుడు కరుణించలేదు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ తొలుత బౌలిం గ్ ఎంచుకున్నాడు. టాస్ తర్వాత వర్షం ప్రారం భం కావడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. 7.50కి మ్యాచ్ ప్రారంభం కాగా.. టీమిండియా బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు దిగారు. వర్షం వల్ల మ్యాచ్‌ను 19ఓవర్లకు కుదించారు. ఇషాన్ కిషన్ తొలి ఓవర్లోనే రెండు సిక్సులు కొట్టి జోరందుకున్నాడు.

అయితే 2వ ఓవర్లో లుంగి ఎంగిడి ఇషాన్ కిషన్ ఊపుకు అడ్డుకట్ట వేశాడు. తెలివిగా స్లో యార్కర్ వేసి (15పరుగులు 7బంతుల్లో 2సిక్సులు)ను బౌల్ చేశాడు. మళ్లీ 4ఓవర్ రెండో బంతికి ఎంగిడి.. రుతురాజ్ గైక్వాడ్ (10పరుగులు 12బంతుల్లో 1ఫోర్)ను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో 27పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చి న పంత్ 1రన్ తీశాడు. 3.3ఓవర్లలో స్కోరు 2వికెట్లు కోల్పోయి 28 పరుగులకు చేరుకుంది. ఇంతలోనే వర్షం ఊపందుకుంది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు ఆపేశారు. ఇక వర్షం తగ్గేవరకు వేచి చూశారు. కానీ ఎంతకు వర్షం తగ్గలేదు. ముసురు పడ్డట్లు కొనసాగుతూనే ఉండడంతో ఫైనల్‌గా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు 9.40కు ప్రకటించారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా భువనేశ్వర్ కుమార్ ఎంపికయ్యాడు.

IND vs SA 5th T20 abandoned due to rain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News