Thursday, May 2, 2024

ఆస్ట్రేలియాకు షాక్..

- Advertisement -
- Advertisement -

IND Women beat AUS Women by 2 wickets in 3rd ODI

మెక్కే : ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. వాళ్ల 26 వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది. ఆదివారం ఆ టీమ్‌తో జరిగిన మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో గెలిచింది. అంతేకాదు వన్డేల్లో ఇండియన్ ఉమెన్స్ టీమ్ చేజ్ చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం. ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 3 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. అయితే ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ ఎగరేసుకుపోయింది. ఇక ఈ నెల 30 నుంచి ఈ రెండు టీమ్స్ ఏకైక పింక్ బాల్ టెస్ట్లో తలపడనున్నాయి. రెండో వన్డేలోనూ గెలిచేలా కనిపించిన ఇండియన్ ఉమెన్స్ టీమ్.. చివరి బంతికి ఝులన్ గోస్వామి నోబాల్ వేయడంతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే మూడో వన్డేలో మాత్రం అలాంటి తప్పిదానికి తావివ్వకుండా జాగ్రత్తగా ఆడారు. షెఫాలీ వర్మ (91 బంతుల్లో 56), యాస్తికా భాటియా (69 బంతుల్లో 64) చేజింగ్లో రాణించారు. దీప్తి శర్మ (30 బంతుల్లో 31), స్నేహ్ రాణా (27 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్ కూడా విజయంలో కీలకపాత్ర పోషించాయి. మహిళల క్రికెట్ గ్రేటెస్ట్ చేజింగ్‌లో ఒకటిగా దీనిని అభివర్ణించవచ్చు.
చరిత్ర సృష్టించిన ఝులన్
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా ఆమె క్రికెట్‌లో మొత్తం సాధించిన వికెట్ల సంఖ్య 600కు చేరింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌ను ఔట్ చేయడం ద్వారా ఝులన్ ఈ ఘనత సాధించింది. ఇప్పటికే 192 వన్డేల్లో 239 వికెట్లతో ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఝులన్ పేరిటే ఉంది. ఇక టెస్టుల్లో 41 వికెట్లు, టీ20ల్లో 56 వికెట్లు ఝులన్ తీసింది. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆమె మొత్తం వికెట్ల సంఖ్య 336కు చేరింది. ఇక డొమెస్టిక్ క్రికెట్లో 264 వికెట్లు తీయగా.. మొత్తం వికెట్ల సంఖ్య 600కు చేరింది.

IND Women beat AUS Women by 2 wickets in 3rd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News