Thursday, May 2, 2024

గులాబ్‌ తుఫాను ప్రభావం: హైదరాబాద్ లో భారీ వర్షం..

- Advertisement -
- Advertisement -

Gulab Cyclone: Rain in Several Areas in Hyderabad

హైదరాబాద్‌:బంగాళఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లో వర్షం కురుస్తుంది. సోమవారం తెల్లవారు జాము నుంచే ఆకాశం మేఘావృతమై చిరుజల్లులతో మొదలైన వాన నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది. తుఫాను ప్రభావంతో నగరంలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు నగరంలో హై అలర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు తెలిపారు.

Gulab Cyclone: Rain in Several Areas in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News