Tuesday, May 7, 2024

గులాబ్‌ తుఫాను ప్రభావం: ఏపిలో భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Gulab Cyclone: Heavy Rains in AP

అమరావతి: బంగాళఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. విశాఖపట్నంలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. గులాబ్‌ తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు.

Gulab Cyclone: Heavy Rains in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News