Thursday, May 2, 2024

న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్

- Advertisement -
- Advertisement -

new zealand

 

చేతులెత్తేసిన విహారి, పంత్, రాణించిన లాథమ్, బ్లండెల్, చివరి టెస్టులోనూ భారత్ ఓటమి, న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్

క్రిస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ టీమిండియాకు క్లీన్‌స్వీప్ తప్పలేదు. రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. సోమవారం నాలుగో రోజే ముగిసిన ఈ మ్యాచ్‌లో కివీస్ ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో సిరీస్‌ను విలియమ్సన్ సేన 20తో దక్కించుకుంది. అంతకుముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా న్యూజిలాండ్ 30తో దక్కించుకున్న విషయం తెలిసిందే. 90/6 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియాను కివీస్ బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే కుప్పకూలింది. ఇక, జట్టును ఆదుకుంటారని భావించిన హనుమ విహారి, రిషబ్ పంత్‌లు పూర్తిగా నిరాశ పరిచారు.

కివీస్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక ఆరంభంలోనే పెవిలియన్ బాట పట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో అలరించిన విహారి ఈసారి ఘోరంగా విఫలమయ్యాడు. 9 పరుగులు మాత్రమే చేసి సౌథి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా వెనుదిరిగాడు. 4 పరుగులు చేసిన పంత్‌ను ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్ దారి చూపించాడు. మహ్మద్ షమి (5)ను సౌథి ఔట్ చేశాడు. జస్‌ప్రిత్ బుమ్రా 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌటయ్యాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 46 ఓవర్లలో 124 పరుగుల వద్ద ముగిసింది. ఇక, రవీంద్ర జడేజా 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ నాలుగు, సౌథి మూడు వికెట్లు పడగొట్టారు.

అలవోకగా
ఇక, 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 36 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన కివీస్‌కు ఓపెనర్లు టామ్ లాథమ్, టామ్ బ్లండెల్ శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని ఆరంభంలోనే వెనక్కిపంపి ఒత్తిడి పెంచాలని భావించిన భారత బౌలర్లకు నిరాశే మిగిలింది. లాథమ్, బ్లండెల్‌లు అద్భుత బ్యాటింగ్‌తో భారత ఆశలపై నీళ్లు చల్లారు. ఇద్దరు కీలక ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నారు.

చెలరేగి ఆడిన లాథమ్ 10 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బ్లండెల్‌తో కలిసి తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. మరో ఓపెనర్ బ్లండెల్ 8 ఫోర్లు, సిక్స్‌తో 55 పరుగులు చేసి బుమ్రా వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక, కెప్టెన్ విలియమ్సన్ ఐదు పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. అయితే రాస్ టెలర్ (5), హెన్రీ నికోల్స్ (5) మరో వికెట్ నష్టపోకుండానే కివీస్‌కు విజయం సాధించి పెట్టారు. ఆల్‌రౌండ్‌షోతో కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఆల్‌రౌండర్ జామిసన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక, వికెట్ల పంట పండించి భారత్ పతనాన్ని శాసించిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథికి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు లభించింది.

India lost in the final Test
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News