Saturday, April 27, 2024

క్రేజీ కాంబినేషన్‌లో సినిమా షురూ

- Advertisement -
- Advertisement -

Balakrishna

 

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ సింహా, లెజెండ్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేస్తున్న మూడో సినిమా సోమవారం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో మొదలైంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఉదయం బాలకృష్ణ పాల్గొనగా ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ చిత్రీకరణతో దర్శకుడు బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్ ఏకధాటిగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని మంచి కథా బలంతో చాలా గ్రాండియర్‌గా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాష్.

Balakrishna new movie shooting start
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News