Tuesday, May 7, 2024

దేశంలో 743 కొత్త కొవిడ్ కేసులు.. ఏడుగురు మృత్యువాత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో శనివారం ఒకేరోజు 743 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,997కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. కొవిడ్ కారణంగా దేశంలో గత 24 గంటల్లో ఏడుగురు మరణించారని తెలిపింది. వీరిలో కేరళలో ముగ్గురు, ఇకర్నాటకలోద్దరు, ఛత్తీస్‌గఢ్, తమిళనాడులో ఒకరి చొప్పున ఉన్నారు. డిసెంబర్ 5వ తేదీ వరకు రోజువారీ కేసులు పదుల సంఖ్యలో ఉండగా చలితీవ్రత విపరీతంగా పెరగడంతో కొవిడ్ కేసుల సంఖ్య వందల సంఖ్యలో నమోదవుతోంది.

2020 ప్రారంభంలో కొవిడ్ ప్రబలిన కాలంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షలలో ఉండేది. దేశవ్యాప్తంగా నాలుగేళ్లలో 4.5 కోట్ల మంది ప్రజలు కొవిడ్ కారినపడగా 5.3 లక్షల మందికిపైగా ఈ వైరస్‌తో మృత్యువాత చెందారు. మొత్తం 4.4 కోట్ల మందికిపైగా వైరస్ నుంచి కోలుకోగా రికవరీ శాతం దేశం 98.81 శాతం ఉందని మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 20.57 కోట్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ అందచేసినట్లు వెబ్‌సైట్ తెలియచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News