Sunday, April 28, 2024

ఓపెనర్లు ఆ ఇద్దరే

- Advertisement -
- Advertisement -

కొలంబో: పరిమిత ఓవర సిరీస్‌ల కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న యువ భారత జట్టు కూర్పుపై ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా సారథి శిఖర్ ధావన్, యువ ఆటగాడు పృథ్వీషాల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. దీంతో టీమిండియాకు తొలిసారి ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్‌లకు మొండి చెయ్యి తప్పేట్లు లేదు. ఈ ఇద్దరికీ తుది జట్టులో స్థానం దక్కేందుకు మరికొంత సమయం పట్టేట్లు ఉంది. ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్ లో పృథ్వీషా పరుగుల వరద పారించాడు. భారీ సెంచరీలు చేశాడు. ఐపిఎల్ 2021లోను అదరగొట్టాడు. దీంతో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు జతగా పృథ్వీషా అయితే బాగుంటుందని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపిఎల్‌లో వీరిద్ద రూ ఒకే జట్టుకు (ఢిల్లీ క్యాపిటల్స్) ఓపెనింగ్ చేయడం అదనంగా కలిసొచ్చే అంశం. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫు న పడిక్కల్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గైక్వాడ్‌లు అదరగొట్టా రు.

అయితే జట్టు ప్రయోజనాల దృష్టా వీరిద్దరూ మరికొంత కాలం వేచి ఉండక తప్పేట్లు లేదు. ఇక మూడో స్థానం కోసం కూడా భారీగానే పోటీ ఉంది. నితీశ్ రాణా, సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు పోటీపడుతున్నప్పటికీ జట్టు యాజమాన్యం మాత్రం సూర్యకుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, చాహల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్‌లకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్ రేసులో ఇషాన్ కిషన్‌లు ఉన్నప్పటికీ సంజుకు సరయిన అవకాశాలు ఇవ్వడం లేదనే అపవాదు బిసిసిఐపై ఉన్నందున అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. స్పిన్నర్ల కోటాలో చాహల్‌కు తోడుగా కృనాల్ పాండేను తీసుకుంటే బ్యాటింగ్‌లో కూడా పనికొస్తాడని యాజమాన్యం భావిస్తోంది. ఇక పేసర్ల విభాగంలో మిగిలిఉన్న ఖాళీకోసం నవ్‌దీప్ సైనీ, సకారియాలో పోటీలో ఉన్నారు. అయితే ఐపిఎల్‌లో అచనాలకుమించి రాణించిన సకారియాకే అవకాశాలు మెండుగా ఉన్నాయని బిసిసిఐ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వన్డే, టి20 సిరీస్‌కోసం శిఖర్ ధావన్ నేతృత్వంలో భారత యువ జట్టు శ్రీలంక వచ్చింది. దేశవాళీ, ఐపిఎల్ టోర్నీలో సత్తా చాటినయువ ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ నెల 18నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రాంభం కానుంది.

India tour of Sri Lanka: Shaw and Dhawan to start Innings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News