Sunday, April 28, 2024

ధనాధన్ బ్యాటింగ్.. విజయం దిశగా భారత్

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి వ‌న్డేలో భారత బ్యాట్స్ మెన్లు చెలరేగి ఆడుతున్నారు. లంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా పృథ్వీ షా, లంక బౌలర్లపై మొదటి నుంచే ఎదురుదాడికి దిగాడు. వరుసగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఆర్థ శతకానికి చేరువగా వచ్చిన షా( 24 బంతుల్లో 43 పరుగులు) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఈషాన్ కిషన్ కూడా ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగి అర్థ శతకాన్ని బాదాడు.ఇక, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా అజయ అర్థశతకంతో ఆడుతున్నాడు. ఈషాన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(26) త్వరగా పెవిలియన్ చేరినా.. భారత్ సునాయస విజయం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం భారత్ 33 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. క్రీజులో ధవన్(76), సూర్యకుమార్ యాదవ్(9)లు ఉన్నారు. టీమిండియా విజయానికి 17 ఓవర్లలో 32 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది.

India towards Victory against Sri Lanka in 1st ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News