Friday, May 3, 2024

ముగిసిన ప్రపంచకప్ షూటింగ్ పోటీలు.. భారత్‌కు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

India win silver medal in Shooting World Cup 2022

చాంగ్‌వాన్: కొరియా వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో భారత్ మరో పతకం సాధించింది. బుధవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో భారత జట్టు రజతం సాధించింది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన ఫైనల్లో భారత్‌కు ఓటమి ఎదురైంది. అనీష్ భన్వాలా, విజయ్‌వీ సిద్ధు, సమీర్‌లతో కూడిన భారత పురుషుల జట్టు ఫైనల్లో పోరాడి ఓడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో చెక్‌కు చెందిన 17-15 తేడాతో భారత్‌ను ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. ఇక, ఫైనల్లో ఓడిన భారత బృందానికి రజతం దక్కింది. ఇక ప్రపంచకప్‌లో భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుది. ఐదు స్వర్ణాలు, ఆరు రజతాలు మరో కాంస్యాలతో మొత్తం 15 పతకాలను భారత్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. గురువారం పోటీలు ముగియనున్నాయి. కాగా ఈ వరల్డ్‌కప్‌లో భారత్ అసాధారణ ఆటతో అలరించింది.ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన అగ్రశ్రేణి షూటర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మరోవైపు భారత షూటర్లు అసాధారణ ఆటతో ఏకంగా 15 పతకాలు గెలుచుకుని చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచారు. ఇదిలావుండగా ఆతిథ్య కొరియా రెండో స్థానంలో నిలిచింది.

India win silver medal in Shooting World Cup 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News