Tuesday, April 30, 2024

ఆయుధాల అక్రమ తరలింపు: పాకిస్తాన్ కుటిల యత్నం భగ్నం

- Advertisement -
- Advertisement -

Indian Army prevented illegal movement of Pakistani weapons

 

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని కరెఎన్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) గుండా భారతదేశంలోకి ఆయుధాలు, పేలుడు సామగ్రిని తరలించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. కిషన్‌గంగా నదిలో ట్యూబ్‌లో వస్తువులను దాచి తాడుతో లాక్కుని వెళుతున్న ఇద్దరు-ముగ్గురు వ్యక్తులను భారత సైన్యం గమనించిందని, వెంటనే ఆ ప్రాంతానికి భారత సైన్యం చేరుకుని ఆ ట్యూబును స్వాధీనం చేసుకుందని శ్రీనగర్‌కు చెందిన చినార్ కోర్ లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు శనివారం తెలిపారు.

అందులో నాలుగు ఎకె 74 తుపాకులు, 2 బ్యాగులలో దాచిన 8 మ్యాగజైన్లు, 240 రౌండ్ల మందుగుండు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేసి సోదాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు నుంచి ఉగ్రవాదులు ఆయుధాలను అక్రమంగా తరలించగడానికి జరిపిన మరో ప్రయత్నాన్ని భారత సైన్యం విజయవంతంగా భగ్నం చేసిందని ఆయన చెప్పారు. ఈ సంఘటనను బట్టి చూస్తే పాకిస్తాన్ వైఖరిలో ఎటువంటి మార్పులేదని అర్థం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News