Wednesday, May 1, 2024

ఇద్దరు రైల్వే రక్షక దళం అధికారులకు ఇండియన్ పోలీస్ పతకాలు

- Advertisement -
- Advertisement -

Indian Police Medals for SCR Railway Defense Force officers

 

మనతెలంగాణ/హైదరాబాద్ : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఇద్దరు రైల్వే రక్షకదళం అధికా రులకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ పతకాలు లభించాయి. సికింద్రాబాద్ పోస్టు ఇన్‌స్పెక్టర్ ఉడుగు.నరసింహతో పాటు విజయవాడ డివిజన్‌లోని తాడేపల్లి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మస్తాన్‌వలీ షేక్‌లకు ఈ అవార్డులు వరించాయి. జోన్‌కు చెందిన ఆర్‌పిఎఫ్ సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన అవార్డులతో తగిన గుర్తింపు లభించడంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంతోషం వ్యక్తం చేశారు. వారి విశిష్టతమైన పనితీరును వారు విధుల పట్ల ప్రదర్శించిన అంకితభావాన్ని ఆయన అభినందించారు. రైలు వినియోగదారుల భద్రతలో, రైల్వే ఆస్తుల పరిరక్షణలో ఆర్‌పిఎఫ్ తమ ప్రాథమిక విధుల్లో గొప్ప పనితీరును కొనసాగిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రూ.1 కోటి 35 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం

సికింద్రాబాద్ పోస్టు ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఉడుగు.నరసింహ 1996 సంవత్సరంలో సబ్ ఇన్‌పెక్టర్‌గా ఉద్యోగంలో చేరి 26 సంవత్సరాలుగా ఆర్‌పిఎఫ్‌లో సేవలందిస్తున్నారు. ప్రారంభంలో ఆయన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఒకప్పటి దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న హుబ్లీ డివిజన్‌లో ఉన్న బళ్లారి, హోస్‌పేట్ వద్ద అనేక రైల్వే ఆస్తులకు సంబంధించి కేసుల దర్యాప్తులను విజయవంతంగా ఛేదించి అక్కడ నేర కార్యక్రమాలను అదుపులోకి తీసుకొచ్చారు. 2010లో ఆయన ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది కాజీపేట, వరంగల్‌లోని సిఐబి/హెడ్‌క్వార్టర్లలో విధులు నిర్వహించారు. ఆయన ప్రయాణికులకు చెందిన వస్తువులను దొంగిలిస్తున్న అనేక ముఠాలను అదుపులోకి తీసుకొని రూ.1 కోటి 35 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

900 మందికిపైగా నేరస్తులపై కేసులు

విజయవాడ డివిజన్‌లోని తాడేపల్లి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కె. మస్తాన్ వలీ 1998లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి క్రమశిక్షణతో అంకితభావంతో అనేక సేవలందిస్తూ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుకున్నారు. సీనియర్ డిఎస్‌సి/ఆఫీస్/బిజెడ్‌ఏ కార్యాలయంలోని క్రైమ్ సెల్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆయన నెలవారి నేర సమీక్షలు, ఎమ్‌సిడిఓఎస్, నెలవారి స్టేట్‌మెంట్లు, ఆర్‌పి (యూపి) యాక్ట్ కేసులు, స్థానిక నేర ఘటనలు, అర్థ సంవత్సరం స్టేట్‌మెంట్లకు సంబంధించిన రిపోర్టులను తయారు చేయడం, దాఖలు చేయడంలో ఆయన కీలకంగా విధులు నిర్వహించారు విజయవాడ పోస్టులో ఎఎస్‌ఐపిఎఫ్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక సంవత్సరంలో 06 ఆర్‌పి (యుపి) యాక్ట్ కేసులను ఛేదించి రైల్వే చట్టం కింద 900 మందికిపైగా నేరస్తులపై కేసులు నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News