Saturday, April 27, 2024

కరోనా రూపం ఇదే.. ఫోటోల‌ను రిలీజ్ చేసిన ఐజేఎంఆర్‌

- Advertisement -
- Advertisement -

Corona

 

హైదరాబాద్ : కరోనా మహమ్మారి యావత్ ప్రంపంచాన్ని వణికిస్తోంది. దీని రూపం ఇప్పటి వరకు పెద్దగా తెలియదు. కిరీటం, పైన తంతువులు ఉండే ఎన్నో చిత్రాలు ఇప్పటి వరకు చూశాం. ఐతే ఎట్టకేలకు దీని రూపాన్ని పట్టుకున్న భారతీయ శాస్త్రవేత్త మైక్రోస్కోప్ ద్వారా ఫొటో తీశారు. పుణె వైరాలజీ ల్యాబ్‌లో ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి చిత్రీకరించారు. ఈ ఫొటో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో సైతం ప్రచురితమైంది. భారత్‌లో జనవరి 30న తొలి కరోనా కేసు నమోదైంది. పూణెలోని వైరాలజీ ల్యాబ్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసును నిర్ధారించారు. కరోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలోని వూహాన్‌ సిటీలో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు జనవరిలో భారత్ చేరుకున్నారు. వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు తేలింది. వీరిలో ఒకరి శాంపిల్స్‌ను పరీక్షిస్తుండగా SARS-CoV-2 (కోవిడ్-19)ని శాస్త్రవేత్తలు గుర్తించి ఫొటో తీశారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 724 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది చనిపోయారు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది.

 

Indian scientist who invented form of Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News