Tuesday, April 30, 2024

బృహస్పతి కన్నా భారీ బాహ్య నక్షత్రగ్రహం

- Advertisement -
- Advertisement -

Indian Scientists discover planet bigger than Jupiter

బెంగళూరు: బృహస్పతి గ్రహం కన్నా 1.4 రెట్లు పెద్దదైన, 70 శాతం ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన భారీ బాహ్య నక్షత్ర గ్రహాన్ని భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారత్‌లో ఈ విధంగా నక్షత్రాన్ని కనుగొనడం ఇదే మొదటిసారి. ఈ కొత్త నక్షత్రాన్ని హెచ్‌డి 82139 గా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. 725 కాంతి సంవత్సరాలకు దూరంగా సూర్యుని కన్నా 1.5 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన పరిణామం చెందుతున్న లేదా వృద్ధాప్య నక్షత్రం చుట్టూ ఈ బాహ్యనక్షత్ర గ్రహం పరిభ్రమిస్తుండడాన్ని వీరు గమనించారని ఇస్రో వెల్లడించింది. అహ్మదాబాద్ కేంద్రంగా గల ఫిజికల్ రీసెర్చి లేబొరేటరీ (పిఆర్‌ఎల్) ఈ బాహ్యనక్షత్ర గ్రహాన్ని పరిశోధించింది. పిఆర్‌ఎల్ అడ్వాన్స్‌డ్ రేడికల్ వెలాసిటీ అబూస్కై సెర్చ్ (పిఎఆర్‌ఎఎస్)ఆప్టికల్ ఫైబర్ ఫెడ్ స్పెక్ట్రోగ్రాఫ్ ను ఉపయోగించి ఈ పరిశోధన చేపట్టారు.

ఈ కొత్త గ్రహం కొలతలను 2020 డిసెంబర్ నుంచి 2021 మార్చి మధ్యకాలంలో గణించారు. తరువాత జర్మనీ లోని టిసిఇఎస్ స్పెక్టోగ్రాఫ్ నుంచి కూడా 2021 ఏప్రిల్‌లో గ్రహం కొలతలను అధ్యయనం చేశారు. పిఆర్‌ఎల్ కు చెందిన 43 సెంమీ టెలిస్కోప్ ద్వారా అబూ నుంచి కూడా అధ్యయనం చేశారు. ఐరోపా, అమెరికా శాస్త్రవేత్తల సహకారంతో ప్రొఫెసర్ అభిజిత్ చక్రవర్తి ఈ పరిశోధక బృందానికి నాయకత్వం వహించారు.

Indian Scientists discover planet bigger than Jupiter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News