Tuesday, April 30, 2024

అఫ్ఘన్‌లో పరిస్థితిపై భారత్ ఆందోళన

- Advertisement -
- Advertisement -
India's concern over the situation in Afghanistan
పొరుగు దేశాలకు ముప్పుగా మారదని ఆశిస్తున్నాం
ఐరాస మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక సమావేశంలో భారత ప్రతినిధి

న్యూఢిల్లీ: అఫ్ఘన్‌లో ప్రస్తుత పరిస్థితి తమ దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని భారత్ మంగళవారం పేర్కొంది. అయితే అది పొరుగు దేశాలకు ఒక సవాలుగా మారబోదని, ఆ దేశం తమ భూభాగాన్ని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లాంటి ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకోవడానికి అనుమతించబోదన్న ఆశాభావాన్నివ్యక్తం చేసింది. అఫ్ఘనిస్థాన్ పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అయిన ఇంద్రమణి పాండే మాట్లాడుతూ, అఫ్ఘన్‌లో తీవ్రమైన మానవతా సంక్షోభం తలెత్తుతోందని, అఫ్ఘన్ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలగడం రోజురోజుకు పెరిగిపోవడంపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.

అయితే త్వరలోనే అక్కడ పరిస్థితి కుదుటపడుతుందని, సంబంధిత పక్షాలు మానవత, భద్రతకు సంబంధించిన సమస్యల గురించి ఆలోచిస్తాయని తమ దేశం ఆశిస్తోందని ఆయన చెప్పారు.. అఫ్ఘన్ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే, అన్ని వర్గాలతో కూడిన ప్రభుత్వం ఏర్పడుతుందని మేము ఆశిస్తున్నాం, అఫ్ఘన్ మహిళల వాణిని, అప్ఘన్ చిన్నారుల, మైనారిటీల హక్కులను గౌరవించాల్సిన అవసరం ఎంతయినా ఉంది’ అని పాండే అన్నారు. ఒక పొరుగుదేశంగాఅఫ్ఘన్‌లో నెలకొన్న పరిస్థితి భారత్‌కు ఆందోళన కలిగిస్తోందన్నారు. అఫ్ఘన్ తాలిబన్ల హస్తగతం అయిన తర్వాత అక్కడ మానవ హక్కులకు సంబంధించిన అంశాలు, పరిస్థితిపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ఈ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News