Saturday, May 4, 2024

11 న ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నా రు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలుల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు.శనివారం సచివాలయంలో సిఎంతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సం బంధించిన మార్గదర్శకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నా రు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథ కం వర్తింపజేయాలని సిఎం అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా విధి విధానాలను తయారు చేయాలన్నారు. ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులకు ముందుగా ప్రాధాన్యమివ్వాలన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా, అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా ఇళ్లు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని సిఎం పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 ల క్షలు అందచేయనున్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలను అందించనున్నారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలన్న నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సిఎం సూచించారు. లబ్ధిదారులు సొంత ఇల్లు తనకు అనుగుణంగా నిర్మాణం చేపట్టినప్పటికీ తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలని రేవంత్ సూచించారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సిఎం సూచించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని సిఎం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News