Thursday, May 2, 2024

ఇండో అమెరికన్లు మా వైపే.. ట్రంప్ క్యాంప్ గంపెడాశలు

- Advertisement -
- Advertisement -

Indo-American vote dictates US President seat

 

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలలో భారతీయ సంతతి అమెరికన్లు తమ ఓటుతో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రత్యేకించి కీలకమైన పోటీ ఉండే రాష్ట్రాలలో ఇండో అమెరికన్ల ఓటే దేశాధ్యక్షుడి పీఠాన్ని ఖరారు చేస్తుంది. ఈ విషయాన్ని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రధాన మద్దతుదారు ఒకరు తెలిపారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఈ సంవత్సారంతంలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రచారకర్తలలో ఒకరైన అల్ మసన్ వార్తా సంస్థకు ఇంటర్వూ ఇచ్చారు. టెక్సాస్, మిచిగాన్, ఫ్లోరిడా, పెన్సిల్వెనియాలలో ఇండో అమెరికన్ల ఓటు ప్రధానం కానుందని తెలిపారు. సాధారణంగా ఆయా రాష్ట్రాలలో ప్రతిపక్ష డెమొక్రాట్ల వైపు భారతీయ సంతతి వారు మొగ్గుచూపుతారు. సాంప్రదాయక ఓటు బ్యాంకులుగా ఉంటారు. అయితే ఈ సారి పరిస్థితిలో కొట్టొచ్చే మార్పు తలెత్తిందని మసన్ విశ్లేషించారు. ట్రంప్ ఇటీవలి కాలంలోనే కాకుండా చాలా కాలం నుంచే ఇండో అమెరికన్లకు చేరువ అవుతూ వచ్చారని, దీనితో ట్రంప్ పట్ల వారి వైఖరి మారిందని తేల్చిచెప్పారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఈ రాష్ట్రాలు ఎక్కువగా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. పైగా ఈ రాష్ట్రాలలోనే ప్రతిపక్ష అధికార పక్ష అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ఆయా రాష్ట్రాలలో 50 శాతానికి పైగా ఇండో అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారని మసన్ తెలిపారు. ట్రంప్ విజయం కోసం ఏర్పాటు అయిన ఇండో అమెరికన్ వర్గీయుల కమిటీ ఫైనాన్స్ విభాగానికి మసన్ సహ అధ్యక్షులుగా ఉన్నారు. నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్ ఉంది. మాజీ ఉపాధ్యక్షులు జో బిడెన్ డెమొక్రాట్ల తరఫున అభ్యర్థిగా ఖరారయి, ఈసారి ట్రంప్ అభ్యర్థిత్వానికి గట్టి సవాలు విసురుతున్నారు. ఫ్లోరిడా, టెక్సాస్, వర్జినియా ఇతర ప్రాంతాలలో తమ బృందం క్షేత్రస్థాయిలో అన్ని విషయాలను ఎటువంటి భేషజాలు లేకుండా పసికట్టిందని, దీని మేరకు తాము ట్రంప్ విజయంపై మరింత దీమాతో ఉన్నట్లు తెలిపారు. దేశంలో దాదాపు 40 లక్షల మంది ఇండియన్ అమెరికన్ జనాభా ఉంది.

ఇందులో దాదాపు 25 లక్షల మందికి పైగా ఓటర్లు ఉండటంతో వీరి ఓట్లు ఎటు పడుతాయనేది కీలకంగా మారింది. వీరిలో సగం మంద వరకూ ప్రతి కీలక రాష్ట్రంలో ట్రంప్ వైపు ఓటేస్తారని, ఇది ఫలితాలను పెద్ద ఎత్తున మార్చివేస్తుందని ఈ ప్రచారకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదాహరణకు సాధారణంగా డెమొక్రాట్ల అనుకూల రాష్ట్రం ఫ్లోరిడాలో 110000 మంది ఇండో అమెరికన్లలో కనీసం 50 వేల మందికి పైగా తమకు ఓటేస్తారని ఇది గెలుపు ఖరారుకు దారితీస్తుందన్నారు. ఇదే విధంగా మిచిగావన్‌లో కూడా జరుగుతుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News