Saturday, May 4, 2024

టీజర్‌కు మంచి స్పందన

- Advertisement -
- Advertisement -

Induvadana teaser released

 

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎంఎస్‌ఆర్ దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ఇందువదన’. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు వరుణ్ సందేశ్. అయితే తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ “ఈ మధ్య నేను సినిమా చేస్తే మా తాతయ్య చూడలనుకున్నాడు. కానీ మా తాతయ్య గత సంవత్సరం చనిపోయాడు. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది”అని అన్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ “ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఫర్నాజ్ శెట్టితో పాటు చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News