Monday, May 6, 2024

రాయనపాడు వ్యాగన్ వర్క్‌షాపులో తనిఖీలు

- Advertisement -
- Advertisement -

రాయనపాడు వ్యాగన్ వర్క్‌షాపులో తనిఖీ నిర్వహించిన
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య

Inspections in rayanapadu Wagon Workshop

మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య రాయనపాడు వ్యాగన్ వర్క్‌షాపులో బుధవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. జనరల్ మేనేజర్ వెంట విజయవాడ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా, జనరల్ మేనేజర్ వర్క్‌షాపు ప్రధాన ప్రవేశ మార్గం వద్ద థర్మల్ స్క్రీనింగ్ సిస్టం, రిమోట్ కంట్రోల్ ద్వారా గేట్ నిర్వహణ పద్ధతిని ప్రారంభించారు. అనంతరం ఓపెన్ కోల్ హోప్పర్ వ్యాగన్ (బిఓబిఆర్) పిఓహెచ్ రేక్‌ను జెండా ఊపి ప్రారంభించిన జిఎం 75 కెఎల్‌డి సామర్థ్యం గల మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

అనంతరం గజానన్ మాల్య డిస్ట్రిబ్యూటర్ వాల్వ్ అసెంబ్లీ కమ్ టెస్ట్ బెంచ్‌ను ప్రారంభించారు. వర్క్‌షాపులో పనుల నిర్వహణలో సౌకర్యం కోసం 20 టన్నుల ఈఓటి క్రేన్, 500 టన్నుల హైడ్రాలిక్ ప్రెస్, సిఎన్‌సి యాక్సిల్ జర్నల్ టర్నింగ్, బర్నిషింగ్ లాత్, పోర్టల్ వీల్ లాత్ వర్క్‌షాప్ సమాచారం అందించే సిస్టం (డబ్ల్యుఐఎస్‌ఈ పాయింట్) వంటి వివిధ పరికరాలను గజానన్ మాల్య ప్రారంభించారు. జనరల్ మేనేజర్ సెంటర్ బఫర్ కప్లర్ (సిబిసి), బోగి సెక్షన్‌లో ఆయన విస్తృత తనిఖీలు నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆయన మొక్కలను నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News