Thursday, March 28, 2024

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు బుధవారం(మార్చి 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియేట్ పరీక్షల నేపథ్యంలో కంట్రోలర్ జయప్రద భాయి, ఇతర అధికారులతో ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ మీడియాతో మాట్లాడారు. ఈ పరీక్షలకు మొత్తం 9,47,699 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,82,677 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,65,022 మంది ఉన్నారని అన్నారు. విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేశారు.విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలకు హాజరుకావాలని నవీన్ మిట్టల్ కోరారు.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఇంటర్మీడియేట్ పరీక్షలకు నిమిషం నిబంధన అమలులోకి ఉంది. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలోని సెల్‌ఫోన్‌తోపాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, సిబ్బందికి కూడా సెల్‌ఫోన్ అనుమతించరు. ఛీఫ్ సూపరింటెండెంట్ మాత్రం ఉదయం 11.30 గంటల తర్వాత సెల్‌ఫోన్ వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 9,47,699 మంది
ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,82,677 మంది
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,65,022 మంది
పరీక్షా కేంద్రాలు 1,473
ఇన్విలేటర్లు 26,333
ఫ్లైయింగ్ స్కాడ్లు 75
సిట్టింగ్ స్కాడ్లు 200

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News