Wednesday, May 15, 2024

ప్రేక్షకుల సమక్షంలో ఐపిఎల్!

- Advertisement -
- Advertisement -

IPL tournament in presence of fans: Arun Dhumal

బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమాల్

ముంబై: దుబాయి వేదికగా వచ్చే నెలలో ఆరంభవమవుతున్న ఐపిఎల్ రెండో దశ టోర్నమెంట్‌ను అభిమానుల సమక్షంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు. దీని కోసం యుఎఇ ప్రభుత్వం అనుమతి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు వివరించారు. ఇక ఐపిఎల్ 8 జట్లతో జరగడం ఇదే చివరిసారన్నారు. దీంతో దీన్ని సాధ్యమైనంత వరకు విజయవంతంగా ముగించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఐపిఎల్ పది జట్లతో జరుగుతుందన్నారు. దీని కోసం త్వరలోనే కొత్త ఫ్రాంచైజీల కోసం వేలం పాట నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ వేదికగా జరిగిన ఐపిఎల్‌ను కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా వేయక తప్పలేదన్నారు. భారత్‌లో పరిస్థితులు మెరుగు పడక పోవడంతో ఐపిఎల్ రెండో దశ టోర్నీని యుఎఇకి తరలించక తప్పలేదన్నారు.

మరోవైపు దుబాయిలో జరుగుతున్న ఐపిఎల్‌లో అభిమానులకు అనుమతి ఇచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. యుఎఇ ప్రభుత్వం అనుమతి తీసుకుని ప్రేక్షకుల సమక్షంలో ఈ టోర్నీని నిర్వహించేందుకు కృషి చేస్తామని ధుమాల్ హామీ ఇచ్చారు. అంతేగాక యుఎఇలో ఇప్పటికే కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని, దీంతో అభిమానులకు స్టేడియాల్లో అనుమతి ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈసారి ప్రేక్షకులకు తప్పక అనుమతి లభిస్తుందనే నమ్మకాన్ని ధుమాల్ వ్యక్తం చేశారు. ఒకవేళ అనుమతిస్తే మాత్రం ఇటు ఆటగాళ్లకు అటు అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఇక తమకు ఆటగాళ్ల భద్రతే ముఖ్యమన్నారు. వారి ఆరోగ్యానికి పూర్తి భద్రత కల్పించేందుకు బిసిసిఐ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం అందరి చూపు యుఎఇ వేదికగా జరిగే ఐపిఎల్ రెండో దశ టోర్నీపై నిలిచిందని, రానున్న ట్వంటీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో దీనికి అధిక ప్రాధాన్యత నెలకొందని ధుమాల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News