Thursday, August 7, 2025

ఎసిబికి చిక్కిన ఇరిగేషన్ డిఈ

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏబీసీ అధికారులు వివిధ పనులకు లంచాలు అడుగుతూ పట్టుబడుతున్న అధికారులపై ఏసిబి అధికారులు వాళ్ల గుండెల్లో రైతులు పట్టాల మాదిరి బెంబేలెత్తిస్తున్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ వాగులో రూ.4 లక్షల రూపాయలు చేసిన పనులకు కాంట్రాక్టర్ నుంచి ఇరిగేషన్ డిఈ రూ.12 వేలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ రూ.11 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

చేసిన పనులలో నష్టం వచ్చిందని కాంట్రాక్టర్ సంబంధిత డిఈ శ్రీకాంత్ నాయుడుకి వేడుకున్న ససేమిరా అనడంతో రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చేసేదేమి లేక రూ.11 వేలకు ఒప్పందం చేసుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం ఏసీబీ అధికారులు ఇరిగేషన్ డిఈ శ్రీకాంత్ నాయుడుకి కాంట్రాక్టర్ రూ.11 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన ఇరిగేషన్ డిఈ శ్రీకాంత్ నాయుడును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News