Sunday, September 21, 2025

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు… 34 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కైరో: ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా దేశాన్ని గుర్తించేందుకు అనేక దేశాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ శనివారం రాత్రివేళ గాజా నగరంపై వైమానిక దాడులు చేసి 34 మంది పాలస్తీనీయుల ప్రాణాలు తీసింది. వారిలో పిల్లలు కూడా ఉన్నారని షిఫా ఆసుపత్రి ఆరోగ్య అధికారులు తెలిపారు. కాగా తాము హమాస్ సైనిక వసతులను పూర్తిగా ధ్వంసం చేయాలనకుంటున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సోమవారం సమావేశం కానున్నది. ఇందులో అనేక దేశాలు పాలస్తీనాను ఓ దేశంగా గుర్తించాలనుకుంటున్నారు. వాటిలో యుకె, ఫ్రాన్స్,కెనడా, ఆస్ట్రేలియా, మల్టా, బెల్జియం, లగ్సెంబర్గ్ వంటివి ఉన్నాయి.

ఇజ్రాయెల్ గత 23 నెలల్లో 65000కు పైగా గాజా ప్రజలను చంపేసింది. గాజాలో ఇప్పుడు 90 శాతం మంది నిరిశ్రయులయ్యారు. అక్కడ ఓ మానవ సంక్షోభం నెలకొని ఉంది. క్షామం విలయతాండవం చేస్తోంది.గాజా నగరం నుంచి పాలస్తీనీయులు కాలినడకన, కార్ల ద్వారా వెళ్లిపోతున్నారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల కుటుంబీకులు మాత్రం కాల్పుల విరమణ జరగాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News